లంచం అంటే వెన్నులో వణుకుపుట్టాలి... ఏపి సిఎం...
అమరావతి : లంచం తీసుకోవాలంటే వెన్నులో వణుకు పుట్టాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారు. అవినీతి నిరోదక శాఖ పనితీరుపై జరిగిన సమీక్షలో ఈమేరకు ఏసిబి అధికారులకు సిఎం జగన్ దిశానిర్ధేశం చేశారు. ప్రస్తుతం అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన మూడునెలల్లో పనితీరు మెరుగుపర్చాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలన ప్రధాన ద్యేయంగా ముందుకు సాగాలని ఏ శాఖలోనైనా అధికారులు లంచం పేరెత్తితే వెన్నులో వణుకు పుట్టాలని ఆవిదంగా ఏసిబి అధికారుల పనితీరు మెరుగుపర్చుకోవాలని హెచ్చరించారు. కాల్‌సెంటర్‌కి వచ్చే పిర్యాదుల పై దర్యాప్తు చురుగ్గా సాగాలని, దాడులు ముమ్మరం చేయాలని సూచించారు. రెవెన్యూ మరికొన్ని శాఖల్లో అవినీతిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో లంచావతారుల గుండెళ్లో రైళ్లు పరిగెట్టించాలని, ప్రజల్లో నమ్మకాన్ని సాధించాలని సిఎం ఏసిబి అధికారులను ఆదేశించారు. మరో మూడునెలల గడువులో పనితీరు మెరుగుపర్చుకోవాలని హితవుపలికారు.
Comments
Post a Comment