రాజధాని ప్రాతంలో ఉద్రిక్తత ... మహిళల అరెస్ట్ .. అడ్డుకున్న స్తానికులు ...

అమరావతి:  రాజధాని నిరసనల్లో భాగంగా  మందడం గ్రామంలో  ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహిళలు సచివాలయం రోడ్డు వద్ద ధర్నాకు చేపట్టారు  వారిని అక్కడ  నుండి తొలిగించేందుకు మహిళా పోలీసులు పెద్ద సంఖ్యలో  చేరుకొని  మహిళలను  పోలీసు వ్యాన్ ఎక్కించారు. ఆ సమయంలో ఇబ్బంది పడిన స్థానిక మహిళలు పెద్ద పెట్టున రోదించారు. పోలీసులు తమతో వ్యవహరించి న తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేసారు. వారికి మద్దతుగా అక్కడే ధర్నా చేస్తున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు  బలవంతంగా తమను అదుపులోకి తీసుకోవటం పైన ఆవేదన వ్యక్తం చేసారు. ఒకే బస్సులో అనేక మందిని ఎక్కించటం ద్వారా వారు ఒత్తిడికి లోనయ్యారు. దీంతో..అక్కడకు చేరుకున్న గ్రామస్థులు వెంటనే వ్యాన్ లోకి ఎక్కించిన మహిళలను వదిలేయాలంటూ ఆందోళనకు దిగారు. వ్యాన్ ముందుకు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా పడుకొన్నారు. దీంతో..వారిని తప్పించేందుకు పెద్ద సంఖ్యలో పోలీసులను తరలించారు .  పోలీసులు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరును మహిళలు తప్పు బట్టారు. తమ గొంతు పట్టుకొని నేరస్థుల మాదిరి దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో అక్కడ చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు వ్యాన్ ఎక్కించిన వారిని దింపేసారు. అయినా స్థానికులు శాంతించలేదు. తమతో వ్యవహరిస్తున్న తీరు పైన పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసు అధికారులు వారిని సాన్తిపచేసారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా