బ్రేకింగ్ న్యూస్.... అత్యాచారం ఆపై మర్మాంగాన్ని కోసేసిన వైనం ...
విజయవాడ : కామంతో కళ్ళు మూసుకుపోతున్న మానవ మృగాల ఆగడాలను చట్టాలు కట్టడి చేయలేని పరిస్థితి నెలకొంది. వావివరసలు కనిపించడంలేదు లైంగిక వాంఛ కోసం ఎంతకైనా తెగబడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో అత్యంత దారుణ సంఘటనసంభవించింది. కామాంధుడు వదిన వరసయ్యే మహిళపై అత్యాచారానికి పాల్పడడం తో పాటు ఆపై ఆమె మర్మాంగాన్ని కోసేసిన పాశవిక ఘటనచోటుచేసుకొంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. మైలవరం నియోజకవర్గం జి. కొండూరు మండలం మునగపాడులో కామాంధుడు రెచ్చిపోయాడు. వదిన వరసయ్యే మహిళను చెరబట్టాడు. గ్రామానికి చెందిన మూడా బాలు అనే వ్యక్తి 45 సంవత్సరాల మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యంత రాక్షసంగా ఆమె మర్మాంగాన్ని కోసేశాడు. ఈ దారుణ ఘటన అనంతరం బాధితురాలు తేరుకుని 100కి డయల్ చేయడంతో పోలీసులు స్పందించారు. సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని చికిత్స నిమిత్తం మైలవరం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు బాలు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
Comments
Post a Comment