అంటార జిల్లా దొంగఅరెస్ట్ ... భారీగా చోరీ సొత్తు స్వాధీనం ...
అనకాపల్లి : అంతర జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసి భారీ ఎత్తున చోరీ సొత్తు పోలీసులు స్వాధీనం చేస్తుకున్నారు. మూడు జిల్లాల్లో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాలుగా నిలిచిన ఈ ముఠా అరెస్ట్ తో సంక్రాంతి కి తాళాలు వేసే ఇళ్లకు కొంత భరోసా కలిగినట్లైంది . విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో చోరీ చేసిన దాదాపు 2700 గ్రాముల బంగారం, నాలుగు కిలోల వెండిని సీజ్ చేసి, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈమేరకు విశాఖ జిల్లా అడిషినల్ ఎస్పీ (క్రైమ్) బి.అచ్యుతరావు పోలీసు అందించిన వివరాలిలావున్నాయి.
విశాఖ సిటీ పరిధి (అగనంపూడికి ) చెందిన ఆటో డ్రైవర్ తాటిపూడి శంకర్ (40), సబ్బవరం మండలం పైడివాడకు చెందిన శెట్టి అప్పలరాజు (40), తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడికి చెందిన శెట్టి ప్రసాద్ (30) కలిసి మూడు జిల్లాల్లో దొంగతనాలు చేశారని అడిషనల్ ఎస్పీ చెప్పారు. చెల్లా రామ్మోహన్‌రెడ్డి, బి.బాబారావు విశాఖనగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలు, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లోని 46 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారన్నారు. అనకాపల్లి పట్టణ పరిధిలో తొమ్మిది చోట్ల, గ్రామీణ ప్రాంతాల్లో తొమ్మిది చోట్ల, ఎలమంచిలి సర్కిల్ పరిధిలో మూడు చోట్ల, చోడవరం సర్కిల్ పరిధిలో మూడు చోట్ల, నక్కపల్లి సర్కిల్ పరిధిలో ఏడు చోట్ల, నర్సీపట్నం రూరల్ పరిధిలో మూడు చోట్ల, కె.కోటపాడు పరిధిలో ఒక చోట చోరీలకు పాల్పడ్డారన్నారు.
విజయనగరం జిల్లా పరిధిలో నాలుగు చోట్ల, విశాఖనగర పరిధిలో ఆరు చోట్ల, తూర్పుగోదావరి జిల్లాలో రెండు చోట్ల చోరీలకు పాల్పడ్డారని చెప్పారు. అప్పలరాజు, శంకర్‌లను కశింకోట పీఏసీఎస్ భవనం వద్ద అరెస్టు చేయగా, వారి సహకారంతో తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలోని శెట్టి ప్రసాద్‌ను అదుపులోకి తీసుకోవడం జరిగిందని అడిషనల్ ఎస్పీచెప్పారు. వీరు మరో పాత నేరస్తుడు బొద్దపు బాబూరావు, చెల్లా రామ్మోహన్‌రెడ్డి చోరీలకు పాల్పడ్డారన్నారు. రామ్మోహన్‌రెడ్డిని చింతపల్లి పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారని చెప్పారు. ఈ చోరీ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న బొద్దపు బాబూరావు ఇటీవల కాలంలో చింతపల్లిలో హత్యకు గురైనట్టుగురయ్యాడన్నారు. కాగా మూడు జిల్లాల్లో జరిగిన చోరీ కేసుల్లో భారీగా బంగారం, వెండి అపహరణకు గురైనప్పటికీ వారి నుంచి 2700 గ్రాముల బంగారం, నాలుగు కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నామన్నారు.
తాటిపూడి శంకర్‌పై విశాఖపట్నంనగరంలోని నాలుగు, రాజమండ్రిలో మూడు దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. శెట్టి అప్పలరాజుపై సామర్లకోట, కొత్తవలస, వల్లంపూడి స్టేషన్‌ల్లో చోరీ కేసులు ఉన్నాయన్నారు. చెల్లా రామ్మోహన్‌రెడ్డి, బొద్దపు బాబూరావులపై తొమ్మిది కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో అనకాపల్లి రూరల్ సీఐ పీవీవీ నరసింహరావు, అనకాపల్లి సీసీఎస్ సీఐ మళ్ల మహేష్, అనకాపల్లి రూరల్ సీఐ పరిధిలోని క్రైమ్ విభాగం ఎస్‌ఐ రమణ, నక్కపల్లి సీఐ విజయ్‌కుమార్ చొరవ చూపారని వారిని అభినందించారు. ఈ సమావేశంలో కాకినాడ సీసీఎస్ డీఎస్పీ వి.భీమారావు, జిల్లాలోని సీఐలు పీవీవీ నరసింహరావు, ఎల్.భాస్కరరావు, ఎన్.సన్యాసినాయుడు, విజయ్‌కుమార్, పిఠాపురం సీఐ అప్పారావు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Comments
Post a Comment