సీబీఐ కోర్ట్ లో జగన్ వ్యక్తి గతంగహాజరవ్వాల్సిందే ....
హైదరాబాద్ : ఏ పీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. ముఖ్యమంత్రి అయిన తరువాత అధికారిక విధుల్లో ఉంటున్న జగన్ తన లాయర్ ద్వారా పిటీషన్ దాఖలు చేయిస్తూ..విచారణకు న్యాయవాదిని పంపిస్తున్నారు అయితే,ఈ నెల 10వ తేదీన ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని సీబీఐ కోర్టు కీలక సూచనలు చేసింది. ఈమేరకు సీఎం జగన్ కోర్టుకు విచారణ నిమిత్తం రావాల్సిందేనని స్పష్టం చేసింది.
జగన్ సీఎం అయిన తర్వాత కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టు జగన్ అభ్యర్థించారు . దీనికి సంబంధించి హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు . దీని పైన ఒక వైపు వాదప్రతివాదనలు కొనసాగుతున్నాయి . ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టులో జగన్ లాయర్ ఆబ్సెంట్ పిటిషన్ వేస్తున్నారు . అయితే ఈసారి జగన్ లాయర్ సిబిఐ కోర్టు కొన్ని ఆదేశాలిచ్చింది. ఈనెల పదో తేదీన తప్పనిసరిగా జగన్ తో పాటుగా విజయసాయిరెడ్డి హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశించింది.
Comments
Post a Comment