ఇంటికే ఇసుక నేడు శ్రీకారం ....

అమరావతి : ప్రజలకు ఇంటివద్దకే ఇసుక సరఫరా చేసే కార్యక్రమం కృష్ణా జిల్లాలో నేటి నుంచి అమల్లోకి రానుంది.
రవాణా సదుపాయం బాధ్యతను కూడా ఏపీఎండీసీనే తీసుకుని కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు బుధవారం ఆ సంస్థ ఎండీ ఎం.మధుసూదన్‌రెడ్డి చెప్పారు. ఇసుక కొనుగోలుదారులు భవన నిర్మాణ ప్రదేశం వివరాలు పోర్టల్‌లో ఉంచి, మ్యాప్‌ ద్వారా జియో ట్యాగింగ్‌ చేస్తారు. దీంతో నిర్మాణ ప్రదేశానికి నేరుగా ఇసుక వచ్చేస్తుంది. బుకింగ్‌ డబ్బు చెల్లించడంతో పాటు రవాణా చార్జీ కూడా చెల్లించాలి. రవాణా చార్జీ కూడా ఏపీఎండీసీ నిర్ణయించింది. 20 కిలోమీటర్ల దూరం వరకు టన్నుకు కిలోమీటరుకు రూ.6.60 రవాణా చార్జీ చెల్లించాలి. 30 కిలోమీటర్ల దూరం అయితే కిలోమీటరుకు రూ.6 చెల్లించాలి. 30 కిలోమీటర్లకు పైన అయితే కిలోమీటరుకు రూ.4.90 చొప్పున రవాణా చార్జీ నిర్ణయించామని ఆయన తెలిపారు. తొలుత కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, తదుపరి అన్ని జిల్లాల్లోను అమలు చేస్తారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా