ఎసిబికి చిక్కిన విఆర్వో ... విశాఖ జిల్లాలో


అనకాపల్లి : లంచం పేరు వింటే వెన్నులో వణుకు పుట్టించే విదంగా అధికారులు చర్యలు చేపట్టాలని సీఎం నిర్దేశించినల్ 24 గంటలలోపు విశాఖ జిల్లా ఎసిబి అధికారులు ఓ అవినీతి అధికారిని కటకటాలు పంపించారు. సీఎం చేపియినా విదంగా రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన అవినీతి జాడ్యాన్ని వదిలించే పని ప్రారంభించారు. ఈమేరకు శుక్రవారం రెవిన్యూ శాఖకు చెందిన విఆర్వోని వలపన్ని పట్టుకున్నారు. ఈ సంఘటన వివరాలిలావున్నాయి. కశింకోట మండలం తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించగా తాళ్లపాలెం చెందిన విఆర్ఓ రాజేష్ రెండు వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.


కశింకోట మండలం  లో తాళ్లపాలెం గ్రామానికి చెందిన గళ్ళ సత్యనారాయణ తన (49,1/2) సర్వే(133/1) సెంట్లు భూమిని ఆన్లైన్ చేయడానికి అని పలుమార్లు దరఖాస్తులు చేసి విసిగి పోయి.ఇటీవల డిసెంబరు నెలలో మళ్ళీ అప్లై చేసి పట్టాదారు పాసుపుస్తకం ఆన్లైన్ చేయడానికి తాళ్లపాలెం వీఆర్వో రాజేష్,  చెప్పగడ్డ ప్రసాద్ ను 3000 రూ అడగగా తాను 2000 ఇవ్వడానికి బేరంకుదుర్చుకున్నాడు.ఈ అవినీతి అధికారి బాగోతాన్ని సీఎం ఏర్పాటు చేసిన ఫిర్యాదు నెంబర్14400 కు ప్రసాద్ తెలియజేసాడు. వెంటనే  ఏసీబీ  డి ఎస్ పి కె.గంగరాజు, సీ.ఐలు ఎస్. కె గోపూర్, రమేష్, లక్ష్మణ్  బాధితుడు ప్రసాద్ ను కలిసి స్థానిక తహశీల్దార్  కార్యాలయానికి చేరుకొన్నారు. అక్కడ ప్రసాద్ నుండి లంచం తీసుకొంటున్న విఆర్వో రాజేష్ ను కార్యాలయంలో డబ్బులు తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్ట్ చేశారు. 


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా