మన్యం బంద్ సక్సెస్.....


స్థంభించిన ప్రజాజీవనం... మూతబడిన వ్యాపార సంస్థలు..బ్యాంకులు..రద్దయిన వారపుసంతలు...


మంగళవారం కూడా కొనసాగనున్న బంద్‌...


చింతపల్లి, పెదబయలు, జికేవీది (జనహృదయం): గిరిజన ప్రాంతంలో 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని, ఏజన్సీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు గిరిజనులకే కేటాయించాలన్న ప్రధాన డిమాండ్లతో చేపట్టిన మన్యం బంద్‌ తొలిరోజు విజయవంతంగా ప్రశాంతంగా ముగిసింది. జాయింట్‌ యాక్షన్‌ కమిటి ఆధ్వర్యంలో 48 గంటల పాటు తలపెట్టిన మన్యం బంద్‌ తొలిరోజు విజయవంతం కాగా మంగళవారం కూడా సంపూర్ణంగా జరిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బంద్‌ సందర్భంగా ఉద్యోగులు, వ్యాపార సంస్థలు స్వచ్చందంగా బంద్‌ పాటిచాయి. ఏజెన్సీ వ్యాప్తంగా 11 మండలాల పరిధిలో గిరిజన సంఘ నాయకులు ఎక్కడి కక్కడ బంద్‌ పాటించేందుకు పిలుపునివ్వగా అన్ని వర్గాల వారు బంద్‌కు సహకరించారు. రవాణ వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. కనీసం ద్విచక్రవాహనాలు సైతం తిరగలేదు. ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రంగా తెరుచుకోగా బ్యాంకులు, ప్రయివేటు, ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి. ఏజన్సీ వ్యాప్తంగా 11 మండలాల పరిథిలో ఉన్న వ్యాపార సముదాయాలు బంద్‌ పాటించగా, సోమవారం జరిగే వారపు సంతలు అన్నీ రద్దయ్యాయి. గిరిజనులు తమ హక్కులను కాపాడుకోవడంలో బాగంగా ఈ బంద్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. గిరిజనుల హక్కులను కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజన చట్టాలకు తూట్లు పొడవకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ప్రక్రియలో ఏజన్సీ వ్యాప్తంగా కేవలం గిరిజనులకే కేటాయించాలని గిరిజనేతరులకు పోటీ చేసే హక్కు కల్పించవద్దంటూ డిమాండ్‌ చేశారు. కాగా గిరిజనులు చేపట్టిన బంద్‌కు ఏజన్సీ వ్యాప్తంగా వ్యాపారాలు చేస్తు జీవనం గడుపుకుంటున్న గిరిజనేతరులంతా స్వచ్చందంగా బంద్‌కు సహకరించి వ్యాపార లావాదేవీలు నిలిపివేసి బంద్‌ విజయవంతం చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. ఏజన్సీ బంద్‌ సంధర్భంగా పోలీసులు తెల్లవారు జామునుండే ముఖ్య కూడళ్లలో పహారా కాశారు. దీంతో మన్యం బంద్‌ ప్రశాంతంగా విజయవంతంగా తొలిరోజు ముగిసింది. మంగళవారం కూడా జరగనున్న ఈ బంద్‌ తో అన్ని రంగాలు స్తంభించిపోయి బంద్‌ సంపూర్ణంగా జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.




మన్యం బంద్‌తో ఇబ్బంది పడ్డ పర్యాటకులు...


గిరిజన చట్టాలను పరిరక్షించుకోవడంలో బాగంగా మన్యంలో తలపెట్టిన 48గంటల బంద్‌కు అరకు, లంబసింగి ప్రాంతాల్లో పర్యాటకులపై తీవ్ర ప్రభావం చూపింది. దూరప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే పర్యాటకుల బంద్‌ కారణంగా వెనుదిరగాల్సి వచ్చింది. పర్యాటకుల వాహనాలను సోమవారం తెల్లవారు జాము నుంచి గిరిజన సంఘ నాయకులు అడ్డుకున్నారు. దీంతో వారు చేసేదిలేక వెనుదిరగాల్సి వచ్చింది. వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మార్గమద్యలో వాహనాలు నిలిచిపోవడంతో కనీసం వారికి టిఫిన్‌ కూడా దొరకని పరిస్థితి నెలకొంది. బంద్‌కి అన్ని వర్గాల వారు మద్దతు పటకడంతో ప్రజా జీవనం పూర్తిగా స్థంభించిపోయింది. బంద్‌లో అన్ని వర్గాలకు చెందిన గిరిజన జాయింట్‌ యాక్షన్‌ కమిటి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా