ఢిల్లీలో అదృశ్యమైన వైద్యులు సిక్కింలో
న్యూఢిల్లీ: డిల్లీలో అదృశ్యమైన ఇద్దరు తెలుగు వైద్యులు దిలీప్ సత్య, హిమబిందు ఆచూకీ లభ్యమైంది. గత నెల 25న వీరిద్దరూ ఢిల్లీలో అదృశ్యమై ప్రస్తుతం సిక్కింలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హిమబిందు భర్త శ్రీధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న డిల్లీ పోలీసులు బృందాలుగా విడిపోయి వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా వారి సెల్ ఫోన్ల పై నిఘా ఉంచారు. ఈ క్రమంలో దిలీప్ సత్య తన సోషల్ మీడియా ఖాతాను ఉపయోగించడంతో సాంకేతిక నిఘా ద్వారా వారి పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ సిక్కిం ఎందుకు వెళ్లారు? వీరి అదృశ్యం వెనుక కారణాలపై విచారణ జరపనున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన హిమబిందు, అనంతపురం జిల్లా హిందూపూర్‌కు చెందిన దిలీప్ సత్య అదృశ్యమైనట్లు డిసెంబర్ 25న డిల్లీలోని హాజ్‌ఖాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు అదృశ్యమైన వైద్యుల ఆచూకీపై వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.
Comments
Post a Comment