దిశా చట్టం అమలుకోసం ప్రత్యేక చర్యలు
అమరావతి : దిశ చట్టం పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం 87 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. మహిళలు, బాలలపై లైంగిక నేరాల సత్వర విచారణకు వీలుగా నిధులు మంజూరు చేశారు. ఈ నిధులను రాష్ట్రంలో మహిళా పోలీసుస్టేషన్ల నవీకరణ , ఫోరెన్సిక్ ప్రయోగశాలల బలోపేతం ఉపయోగిస్తారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు, దిశ కాల్‌సెంటర్, యాప్‌ల కోసం వినియోగించనున్నారు. విశాఖపట్నం, తిరుపతి ఫోరెన్సిక్ ప్రయోగశాలల్లో డీఎన్‌ఏ, సైబర్ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ప్రయోగశాలలోని డీఎన్ఏ , సైబర్ విభాగాల్ని మరింత పటిష్ఠం చేయనున్నారు డయల్ 100, 112లకు సంబంధించి ఒకే కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి దాన్ని దిశ కంట్రోల్ రూంగా పిలవనున్నారు.
దిశ యాప్ కోసం కోటి 26 లక్షల రూపాయలను వినియోగించనున్నారు. ప్రతి బస్‌స్టాప్ సెంటర్‌కు ఒక మహిళా ఎస్సై పోస్టు మంజూరు చేశారు. ప్రత్యేక కేసుల విచారణ సందర్భంగా అదనపు విధులు నిర్వర్తించే మహిళా పోలీసుస్టేషన్ సిబ్బందికి 30 శాతం ప్రత్యేక భత్యం చెల్లించనున్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించనున్నారు
Comments
Post a Comment