వాతావరణ సూచన ....

విశాఖపట్నం :  బంగాళాఖాతం నుంచి కోస్తాపైకి తేమగాలులు వీస్తున్నాయి. అదే సమయంలో ఉత్తర ఒడిశా పరిసరాల్లో ద్రోణి బలహీనపడినా దాని నుంచి ఉత్తర కోస్తాపైకి గాలులు వీస్తున్నాయి. ఈ రెండింటి ప్రభావంతో బుధవారం మధ్యాహ్నం నుంచి కోస్తాలో అనేకచోట్ల మేఘాలు ఆవరించాయి. దీంతో వాతావరణం చల్లబడడమే కాకుండా అక్కడక్కడా వర్షాలు కురిశాయి.
బుధవారం సాయంత్రం వరకు పరదేశిపాలెం, కాపులుప్పాడలో మూడు, చిలకలూరిపేటలో రెండు, శ్రీకాళహస్తిలో ఒక సెంటీమీటరు వర్షపాతం నమోదైంది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా