లారీ బోల్తా ఒకరు మృతి
బెంగళూరు : కృష్ణగిరి జిల్లా డెంకణీకోట తాలూకు అంచెట్టి సమీపంలో ట్యాంకర్ లారీ బోల్తాపడడంతో ఒకరు మృతి చెందారు.
అంచెట్టి నుంచి ఉరిగం గ్రామానికి ప్రభుత్వ టాస్మార్క్ దుకాణానికి మద్యం బాటిళ్ళతో కూడిన బాక్స్‌లను తీసుకొని వెళ్తున్న ట్యాంకర్ లారీ ఎర్రమద్దనపల్లి గ్రామం వద్ద వెళ్తుండగా అకస్మాతుగా అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో లారీలో ప్రయాణిస్తున్న కృష్ణగిరి సమీపం పాంచాలియూరు గ్రామానికి చెందిన గోవిందన్(40) మృతి చెందాడు. కృష్ణగిరి సమీపం తిప్పనపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ శివకుమార్(39) పరారయ్యాడు. సమాచారం తెలిసిన వెంటనే అంచెట్టి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం కారణంగా మార్గంలో అర గంట సేపు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది
Comments
Post a Comment