పటిష్టంగా దిశ చట్టం అమలు చేయాలి .. కృత్తికా శుక్లా వెల్లడి ...
అమరావతి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దిశ చట్టం పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని దిశా చట్ట పరిరక్షణ ప్రత్యేక అధికారిణి కృతికా శుక్లాస్పష్టం చేశారు. దిశా చట్టం విధి విధానాలపై ఆమె శుక్రవారం 13 జిల్లాల అధికారులతో వీడియో కాన్షరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలకు రక్షణ కవచంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశా చట్టాన్ని తీసుకు వచ్చారని, చట్టం అమలుకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలనికోరారు . చట్టం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినం చర్యలు తీసుకుంటామని కృతిక శుక్లా స్పష్టం చేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ పథకాల ద్వారా బాధితులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వైఎస్సార్ కిశోరి వికాసం పథకం కింద ప్రాథమిక స్థాయి నుంచే సెల్ఫ్ డిఫెన్స్‌పై అవగాహన కల్పిస్తామని తెలిపారు.
Comments
Post a Comment