చెలిమికే ప్రాధాన్యం... తేడా వస్తే తాటతీస్తామంటున్న 'గిరి'జనం...
ఆదివాసీ చేతిలో హతమైన మావోయిస్టు...
ఏఓబిలో ఎదురుతిరిగిన ఆదివాసీలు ...
ఇరువురికి గాయాలు ఒకరు పరార్ మరొకరిని ఆసుపత్రిలో చేర్చిన వైనం..
సీలేరు/ చింతపల్లి (జనహృదయం) : ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బతగిలింది. ఇంతకాలం ఆదివాసీల ఆదరాభిమానాలే తమ కార్యకలాపాలకు ఆలవాలంగా చేసుకున్న మావోయిస్టులకు ఆదివాసీల వ్యతిరేకత వారి మనుగడకే ముప్పుకలిగిస్తోంది. ఆదివాసీలను కట్టడి చేసేందుకు యత్నించిన మావోయిస్టులు వారి ఆగ్రహానికిగురై ఒకరు మృతిచెందగా మరొకరు ఆసుపత్రిపాలయ్యారు. ఆదివాసీలు తలచుకుంటే గుండెల్లో గూడుకట్టి దాచుకుంటారని తేడా వస్తే తాటతీస్తారని ఆంద్రా, ఒరిస్సా సరిహద్దు ప్రాంతానికి చెందిన గిరిజన తండా వాసులు నిరూపించారు.
ఏళ్లతరబడి మావోయిస్టుల కదలికలకు ఆయువుపట్టుగా ఉన్న ఆదివాసీల ఆదరాభిమానాలకు ఒక్కసారిగా తిరగబడి సాయుధులైన మావోయిస్టులను సైతం మట్టుపెట్టారు. ఇంతటి విపత్కర పరిస్థితులకు మావోయిస్టుల అనాలోచిత నిర్ణయాలు, గిరిజనులపై సాగిస్తున్న మారణకాండ కారణమా అనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. దశాబ్దాలకాలం నుంచి పోలసుల నుంచి మావోయిస్టులను కాపాడేది ఆదివాసులేనని వారిలో మార్పు తెచ్చేందుకు పోలీసులు, ప్రభుత్వాలు శతవిదాలుగా ప్రయత్నిస్తునే ఉన్నాయి. కేసులతోనో, బెదిరింపుతోనో కట్టడి చేయలేక ఆదివాసులతో చెలిమికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ దిశగా సత్‌ఫలితాలు ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం సాధిస్తున్నాయి.
సానుభూతి కోల్పోతున్న మావోయిస్టులు..
ఈ నేపథ్యంలో మావోయిస్టులపై ఆదివాసీల ఆదరాభిమానాలు సన్నగిల్లుతూ తిరుగుబాటు దిశగా పరిస్థితులు మారుతున్నాయా అంటే అవుననే విదంగా శనివారం అర్థరాత్రి ఏఓబి సరిహద్దు ప్రాంతంలో జరిగిన రుజువుచేస్తోంది. గతంలో విశాఖ ఏజన్సీ చింతపల్లి మండలం వీరవరం గ్రామానికి చెందిన ఓ గిరిజనుడిని మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ పేరిట హతమార్చడంతో గ్రామస్తులంతా ఏకమై మావోయిస్టు అగ్రనాయకుడుతోపాటు మరోసభ్యుడిని కర్రలతో కొట్టి చంపేశారు. ఈసంఘటన ఏఓబిలో ప్రప్రధమంగా చోటుచేసుకొంది. ఇదే తరహాలో ఒరిస్సా బోర్డర్‌లో పునరావృతం అయ్యింది. ఆదివాసీల్లో ఆలోచనా ధోరణి మారుతోందనేందుకు ఇది సంకేతంగా నిలుస్తోంది. ఈ సంఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదివాసీల చేతిలో హతమైన మావోయిస్టు...
ఆంద్రా-ఒడిశా పరిధిలో మావోయిస్టులను ప్రతిఘటించిన గ్రామస్థులు, మావోయిస్టులపై గ్రామస్థులు దాడి చేయడంతో ఈ సంఘటనలో ఒక మావోయిస్టు మ తిచెందగా, మరొక మావోయిస్టుకు తీవ్రగాయాలయ్యాయి. ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లోని చిత్రకొండ బ్లాక్ పరిధిలోని జొడొంబో పంచాయతీ జంతురాయ్ గ్రామానికి శనివారం రాత్రి సమయంలో ముగ్గురు సాయుధ మావోయిస్టులు వచ్చారు. గ్రామానికి చెందిన ఒక గిరిజనుడ్ని తమతోబాటు తీసుకెల్లడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ సమయంలో మావోయిస్టులకు గ్రామస్తులకు మద్య ఘర్షణ జరిగింది. దీంతో మావోయిస్టులపై గ్రామస్థులు రాళ్లు దాడిజరపగా ఒక మావోయిస్టు అక్కడ నుంచి పరారయ్యాడు. మిగతా వారిలో ఒకరు సంఘటనాస్థలంలో మ తిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ దాడిలో నంద పూర్ ఏరియా కమిటీ సభ్యుడు జిప్రొ త్రీవ గాయాలుతో ప్రాణాలు దక్కించుకోగా గుమ్మ ఏరియా కమిటీ సభ్యుడు హడ్మా మృతి చెందాడు. గాయాలతో ఉన్న మావోయిస్ట్ జిప్రొ ని అదుపు లోకి తీసుకున్న బీఎస్ ఎఫ్ బలగాలు మల్కన్‌గిరి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
Comments
Post a Comment