రోడ్డు ప్రమాదంలో కాలిపోయిన టూరిస్ట్ బస్
శ్రీకాకుళం : జిల్లాలోని పైడి భీమవరం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. ఉత్తరఖండ్‌కు చెందిన టూరిస్ట్ బస్సు మంటల్లో కాలి బూడిదయింది. పూరిలో జగన్నాధస్వామి దర్శనం చేసుకుని విశాఖపట్నం వెళ్తుండగా.. ఒక పర్రిశమకు చెందిన బస్సు అదుపు తప్పి టూరిస్ట్ బస్‌ను ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 15 మంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రణస్థలం ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనతో అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.
Comments
Post a Comment