రైతులకు జగన్ సర్కారు తీపి కబురు
అమరావతి : ఏపీ రైతులకు జగన్ సర్కారు తీపి కబురు అందించింది. అన్నదాతల బ్యాంకు ఖాతాల్లోకి రూ.2వేలు జమ చేయనుంది. పీఎం కిసాన్ కింద రావాల్సిన భరోసా సొమ్మును రైతు భరోసా పథకంలో భాగంగా.. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయనుంది. సుమారు 46,50,629 మంది ఖాతాలకు రైతు భరోసా తుది విడత మొత్తం దాదాపు రూ.1,082 కోట్లను నేరుగా బదిలీ చేస్తామని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. వాస్తవ సాగుదారులు, కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్, దేవాదాయ, ధర్మాదాయ భూముల్ని సాగు చేసుకుంటున్న వారు, ఇతర వర్గాల సాగుదార్లకు సొమ్ము అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులు, కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 ఇస్తామని ప్రకటించి ఇప్పటికే రూ.11,500ను జమ చేసింది. కాగా, లబ్ధిదారుల పేర్లను శుక్రవారం నుంచి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు.
Comments
Post a Comment