ఫ్లాష్ ..ఫ్లాష్ ... నిర్భయ దోషులకు 22న ఉరిశిక్ష


న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఈ నెల 22న నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీ పాటియాల హౌజ్ కోర్టు తీర్పునిచ్చింది. దీని సంబంధించి నిందితులకు డెత్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది. జనవరి 22న ఉదయం 7 గంటలలోపు ఉరిశిక్ష ప్రాసెస్ ను పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. 2012 డిసెంబరు 16న రాత్రి ఢిల్లీలోని ఒక బస్సులో నిర్భయను ఆరుగురు గ్యాంగ్ రేప్ చేసి తీవ్రంగా గాయపరిచారు. 13 రోజుల తర్వాత నిర్భయ సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఆరుగురు నిందితుల్లో ఒక నిందితుడు రాంసింగ్ తీహార్ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక నిందితుడు మైనర్. అతనికి మూడు సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఇక మిగిలింది నలుగురు నిందితులు ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్. వీరిలో ముఖేష్, పవన్, వినయ్ క్షమాభిక్ష పిటిషన్ వేశారు. వారిక్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించారు. అయితే కోర్టు తీర్పు పై నిందితుల తరపు న్యాయవాది స్పందించారు. ఉరిశిక్ష తీర్పు పై క్యూరేటివ్ పిటిషన్ వేస్తానని తెలిపాడు. నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడడంతో ఆమె తల్లిదండ్రులుమాట్లాడుతూ . ఇప్పుడు తమ కూతురు ఆత్మ శాంతిస్తుందని  నిర్భయ తల్లి అన్నారు.ఈ తీర్పు తర్వాత తమకు న్యాయ వ్యవస్థ పై మరింత నమ్మకం పెరిగిందన్నారు. 


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా