కాచిగూడ-గుంటూరు ప్యాసింజర్ రైలు 20 రోజుల పాటు రద్దు
కాచిగూడ: కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 2.40నిమిషాలకు బయలుదేరే కాచిగూడ-గుంటూరు ప్యాసింజర్ రైలు కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి ఈనెల 18 నుంచి ఫిబ్రవరి 5 తేదీ వరకు 20 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు హైదరాబాద్ డివిజనల్ రైల్వే సీనియర్ డీసీఎం వెంకన్న తెలిపారు. రైల్వే ప్రయాణికుల కోసం మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడానికి గుంటూరు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రైల్వే పనులను ఆధునీకరిస్తున్నట్లు అందుకు కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి నిత్యం బయలేదేరుతున్న గుంటూరు ప్యాసింజర్ రైలు వచ్చేనెల 5వ తేదీ వరకు రద్దు చేస్తున్న ట్లు ఆయన పేర్కొన్నారు. ఈమార్పును రైల్వే ప్రయాణికులు గమనించగలరని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment