చెలిమికే ప్రాధాన్యం... తేడా వస్తే తాటతీస్తామంటున్న 'గిరి'జనం...
ఆదివాసీ చేతిలో హతమైన మావోయిస్టు... ఏఓబిలో ఎదురుతిరిగిన ఆదివాసీలు ... ఇరువురికి గాయాలు ఒకరు పరార్ మరొకరిని ఆసుపత్రిలో చేర్చిన వైనం.. సీలేరు/ చింతపల్లి (జనహృదయం) : ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బతగిలింది. ఇంతకాలం ఆదివాసీల ఆదరాభిమానాలే తమ కార్యకలాపాలకు ఆలవాలంగా చేసుకున్న మావోయిస్టులకు ఆదివాసీల వ్యతిరేకత వారి మనుగడకే ముప్పుకలిగిస్తోంది. ఆదివాసీలను కట్టడి చేసేందుకు యత్నించిన మావోయిస్టులు వారి ఆగ్రహానికిగురై ఒకరు మృతిచెందగా మరొకరు ఆసుపత్రిపాలయ్యారు. ఆదివాసీలు తలచుకుంటే గుండెల్లో గూడుకట్టి దాచుకుంటారని తేడా వస్తే తాటతీస్తారని ఆంద్రా, ఒరిస్సా సరిహద్దు ప్రాంతానికి చెందిన గిరిజన తండా వాసులు నిరూపించారు. ఏళ్లతరబడి మావోయిస్టుల కదలికలకు ఆయువుపట్టుగా ఉన్న ఆదివాసీల ఆదరాభిమానాలకు ఒక్కసారిగా తిరగబడి సాయుధులైన మావోయిస్టులను సైతం మట్టుపెట్టారు. ఇంతటి విపత్కర పరిస్థితులకు మావోయిస్టుల అనాలోచిత నిర్ణయాలు, గిరిజనులపై సాగిస్తున్న మారణకాండ కారణమా అనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. దశాబ్దాలకాలం నుంచి పోలసుల నుంచి మావోయిస్టులను కాపాడేది ఆదివాసులేనని వారిలో మార్పు తెచ్చేందుకు పోలీసులు, ...