కొనసాగుతున్న మీసేవల సమ్మె.....పౌరసేవలకోసం జనం పాట్లు...


విశాఖపట్నం (జనహృదయం) : తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో మీ సేవా ఆపరేటర్‌లు చేస్తున్న బంద్‌ తొమ్మిదవ రోజుకు చేరుకుంది గత 15 ఏళ్లుగా మీసేవ నమ్ముకొని జీవనం గడుపుతున్న తమ బ్రతుకులు రోడ్డుపాలు చేయొద్దని తమకు బ్రతుకు భరోసా కల్పించాలని ఆపరేటర్లు ఈనెల 20 నుంచి సమ్మె చేపట్టారు. గత తొమ్మిది రోజులుగా సాగుతున్న మీసేవ నిర్వాహకుల సమ్మెతో ఓ వైపు ఆపరేటర్లు, మరోవైపు పౌరసేవలు స్థంభించిపోెయి  ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో మీసేవ బంద్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. మీసేవలన్నీ ఒక్కసారిగా మూతబడడంతో తమ లావాదేవీలపై ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


నెలాఖరు కావడంతో విద్యుత్‌ బిల్లులు చెల్లింపు కోసం నానా అవస్థలు పడుతున్నారు. డిజిటల్‌ లావాదేవీలపై అంతగా అవగాహన లేని గ్రామీన జనం పాట్లు వర్ణణాతీతంగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విదంగా ఏకంగా తొమ్మితి రోజులు మీసేవలు మూతబడడంతో వివిద కార్యాలయాలకు సంబందించిన పౌరసేవలు నిలిచిపోయి అడంగల్‌ కావాలన్నా కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్నారు. ప్రధానమైన రెవన్యూ సేవలు స్థంభించిపోయి యువతరం నానా అవస్థలు పడుతున్నారు. మీసేవ నిర్వాహకుల డిమాండ్‌ న్యాయబద్దంగా ఉండడంతో అటు వినియోగదారులు, ఇటు ప్రజా సంఘాలు, వివిద రాజకీయ పార్టీలు భేషరతుగా మద్దతు పలుకుతూ వెంటనే మీసేవ నిర్వాహకుల సమ్మెని విరమించే విదంగా ప్రభుత్వం చర్చలు చేపట్టాలన్న డిమాండ్‌ రోజురోజుకూ ఉదృతమవుతోంది.



మీసేవలలో ఏళ్లతరబడి చేస్తున్న ప్రభుత్వ సేవలను సచివాలయ వ్యవస్థలో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడంతో మీసేవలపై ఆధారపడి వాటిపైనే చాలీచాలని కమీషన్లతో కాలం వెళ్లదీస్తున్న నిర్వాహకులు జీవనోపాధి ప్రశ్నార్ధకం కానుంది. దీనికోసం వారంతా గత కొంతకాలంగా ఆందోళన చెందుతూ తమ బ్రతుకులకు భరోసా కల్పించాలంటూ తహశీల్దార్‌ నుంచి సిఎం వరకు వినతి పత్రాలిస్తూ వచ్చారు. అయితే జనవరి నుంచి సచివాలయ వ్యవస్థ కార్యరూపం దాల్చుతున్న నేపథ్యంలో తాము జీవనోపాధి కోల్పోతామనే ఆవేదనతో సమ్మెబాట చేపట్టారు. శాంతియుతంగా వివిద రూపాల్లో తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి చేరవేస్తూ సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందనలో మరోసారి మీసేవ సంక్షేమ సంఘాల ద్వారా సోమవారం వినతి పత్రాలు అందింది తమను ఆదోకోవాలిని విజ్ఞప్తి చేశారు.  నాటి పాదయాత్ర సమయంలో తమకు ఉపాధి దిశగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన నేటి ముఖ్యమంత్రి అభయానికై లక్షలాది మంది ఆత్రుతగా ఎదురుచూస్తూ తమ ఆవేదనను వివిద రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. న్యామపరమైన తమ జీవనోపాధి డిమాండ్‌తో ప్రధానంగా సాగుతున్న ఈ ఉద్యమానికి అన్న వర్గాల వారి మద్దతు లభిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మీ సేవా నిర్వాహకులకు న్యాయం చేయాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా