స్పందన అర్జీలు సత్వర పరిస్కారం....ఆర్డీవో శివ జ్యోతి
నర్సీపట్నం : స్పందన అర్జీలను పరిశీలించి, ఆయా గ్రామాలలో స్వయంగా పర్యటించి చర్యలు తీసుకుంటానని రెవిన్యూ డివిజనల్ అధికారి కె లక్ష్మి శివ జ్యోతి తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన లో భాగంగా సోమవారం 26 అర్జీలు వచ్చాయి. స్పందన లో అధిక సంఖ్యలో భూ సంబంధిత సమస్యలపై ప్రజలు వారి వినతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ డి ఓ మాట్లాడుతూ తాను నర్సీపట్నం లో జాయిన్ అయిన తర్వాత మొదటిసారి స్పందన లో పాల్గొని ప్రజల సమస్యలను తెలుసు కోవడం జరుగుతుందన్నారు. సమస్య లపై సంబంధిత మండల అధికారులకు నిర్ణీత గడువులోగా అర్జీలను పరిశీలించి పరిష్కరించే విధంగా చర్యల కు ఆదేశించడం జరిగిందన్నారు. అధిక సంఖ్యలో భూ సంబంధిత సమస్యలు వస్తున్నాయి కాబట్టి , స్వయంగా మండలాలలో పర్యటించి సమస్యలను గూర్చి తెలుసుకొని పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకుంటామన్నారు.
నాతవరం మండలం వైబి పట్నం చెందిన ముత్తాల నాగమణి సర్వేనెంబర్ 473 /5లో రెండెకరాల భూమిలో సాగు చేసుకుంటున్నానని, దానికి పాస్ పుస్తకం కూడా ఉన్నదని అయినప్పటికీ కొంతమంది తనపై దౌర్జన్యం చేసే ఆక్రమించుకుంటన్నారని తగు న్యాయం చేయాల్సిందిగా కోరారు. మాకవరపాలెం రాచపల్లి గ్రామస్తులు దరఖాస్తులలో సర్వే నెంబర్ 16 55 లో సుమారు 50 ఎకరాల బంజరు భూమిని అన్యాక్రాంతం గా ఒక వ్యక్తి ఆక్రమించుకు న్నారని, ఆ భూమిని భూమిలేని నిరుపేదలకు డీ ఫారం పట్టాలు ఇచ్చి సాయం చేయాల్సిందిగా ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సభ్యులు కోరారు. నాతవరం మండలం శ్రుంగవరం గ్రామానికి చెందిన కలిశెట్టి వీరా పాత్రుడు 214 లో 38 సెంట్లు 238 లో 36 సెంట్లకు ఆన్లైన్లో నమోదు చేసి పట్టాదార్ పాస్ పుస్తకం ఇప్పించవలసిందిగా కోరారు. నర్సీపట్నం గాబ్బాడ నివాసులు సర్వే నెంబర్ 71 -4, 71-6 లో ప్రభుత్వం ఇచ్చిన డి పట్టా భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతున్నదని, సదరు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంది గా విజ్ఞప్తి చేశారు.
కోటవురాట్ల మండలం బోడ పాలెం గ్రామానికి చెందిన అనిశెట్టి లక్ష్మి సర్వే నెంబర్ 298 లో 1.20 సెంట్ల భూమిని డిస్ప్యూట్ రిజిస్టర్ లో నమోదు చేశారని దానిి నుండి తొలగించి తన భూమిని అప్పగించాల్సింది గా కోరారు. రావికమతం మండలం అజయ్ పురం వాసులు మారుమూల గ్రామానికి చెందిన గిరిజనులమని 25 సంవత్సరాల నుండి అక్కడే నివాసం ఉంటున్నామని, తమ గ్రామానికి దగ్గరలోనే మైనింగ్ బ్లాస్టింగ్ లుజరుగుతున్నాయని తమ ఇళ్ల కు బీటలువారి భయంతో ఉంటున్నామని తగు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యురాలు శ్రీమతి మత్స్య రాస మణికుమారి ఆర్ డి ఓ ను కలిసి శివపురం ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ బాలిక లనుండి వచ్చిన ఫిర్యాదుపై మాట్లాడీ తగు చర్యలు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment