విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ ...
నర్సీపట్నం : విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుకు సీఎం జగన్మోహనరెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా నర్సీపట్నం టౌన్ లో మూడు వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. నర్సీపట్నంశాసన సభ్యుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ర్యాలీలో నర్సీపట్నం నియోజకవర్గంకు చెందిన నాలుగు మండలాల వైసిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు యువకులు , నర్సీపట్నంలోని ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు, యాజమాన్యం, ప్రైవేట్ కాలేజీల యూనియన్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ విశాఖలో రాజధాని ఏర్పాటుతో వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.
Comments
Post a Comment