వసతిగృహాన్ని సందర్శించిన ఆర్ డి ఓ
నర్సీపట్నం : బాలికల వసతి గృహంలో వార్డెన్ భర్త తమను వేధిస్తున్నాడని బాలికలు పిర్యాదు చేయడంతో వెంటనే వసతిగ్రుహాన్ని సందర్శించారు. శివపురం లో గల గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహం ఎస్ టి -3 ను ఆర్డీఓ లక్ష్మీ శివ జ్యోతి సందర్శించారు. వసతి గృహ బాలికలు సోమవారం ఉదయం సబ్కలెక్టర్ కార్యాలయంలో ఆర్టిఓ కలిసి హాస్టల్ మెట్రిన్ భర్త తమ హాస్టల్ లో నిబంధనలకు విరుద్ధంగా ఉంటూ తమపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తగు చర్యలు తీసుకో వలసిందిగా కోరగా దానికి స్పందిస్తూ సోమవారం మధ్యాహ్నం వసతి గృహాన్ని సందర్శించి బాలికల తో మాట్లాడి విషయాలను తెలుసుకున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఎస్-1, ఎస్-2 వసతి గృహాలను కూడా ఆర్డీవో సందర్శించారు . వసతి గృహంలో వచ్చిన సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Post a Comment