ఉత్తరాదిలో చలి పులి
విశాఖపట్నం: ఉత్తరాది రాష్ట్రాల్లో నెలకొన్న చలి ప్రభావం ఉత్తర కోస్తా వరకు విస్తరించింది. పొరుగునున్న ఒడిశా మీదుగా వీస్తున్న గాలులతో మంగళవారం రాత్రి నుంచి చలి వాతావరణం నెలకొంది. బుధవారం కళింగపట్నంలో 16.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
దక్షిణ తమిళనాడు పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిశాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం వుందని, అయితే ఎక్కువచోట్ల పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఇదేసమయంలో ఉత్తర కోస్తాలో చలి వాతావరణం కొనసాగుతుందన్నారు.
Comments
Post a Comment