దళితులపై వివక్ష తగదు ...
గన్నవరం : స్వాత్రంత్రం వచ్చి 73 సంవత్సరాలు అయిన దళిత బహుజనులు పట్ల వివక్షత పోలేదని నా దీపం గ్రూప్స్ అధినేత గోగులమూడి రత్నం ఆవేదన చెందారు సోమవారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిల పక్షం సమావేశానికి హాజరైన దళిత బహుజన పార్టీ అధ్యక్షులు వడ్లమూడు కృష్ణ స్వరూప్ హై కోర్ట్ అడ్వాకెట్ ని ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ,వారి సిబ్బంది కలిసి మెడపట్టి కృష్ణ స్వరూప్ ను బయటకు గెంటివేయడం దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమేనని వాపోయారు. . ఈ సంఘటన ను ఎస్సి ఎస్టీ చట్టం పరిధిలోకి తీసుకుని నాగిరెడ్డి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు తరుపున డిమాండ్ చేశారు. ఈ చర్య కేవలం కృష్ణ స్వరూప్ కు జరిగిన అన్యాయం కాదని, యావత్తు దళిత జాతికి జరిగిన అన్యాయంగా పేర్కొన్నారు. దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసిన కమిషనర్ పై తక్షణమే చర్యలు తీసుకోని భవిష్యత్ లో దళితులపై అరాచకాలు, అవమానాలు,అవరోధాలు,దూషింపబడడం జరగకుండా ప్రభుత్వం తగు కఠిన చర్యలు తీసుకోవలని కోరారు.
Comments
Post a Comment