రైతుల అరెస్ట్ ను ఖండించిన చంద్రబాబు

అమరావతి:  రాజధాని కోసం దీక్ష చేస్తున్న రైతుల  అరెస్ట్ ను  టిడిపి అధ్యక్షులు చంద్రబాబు ఖండించారు. ఈమేరకు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ద్వారా  రైతుల అరెస్ట్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై హత్యాయత్నం అభియోగాలు పెట్టడాన్ని ఖండించారు.  రైతుబిడ్డలైన పోలీసులు రైతుల పట్ల సానుభూతిగా లేకుండా  భూములు కోల్పోయి, రాజధానిపై ఆందోళనలో ఉన్నవాళ్లపై పోలీసు కేసులా అంటూ ఆవేదహన చెందారు. నిద్రాహారాలు మాని ఆందోళన చేసే రైతులపై పోలీసు దాడులు హేయం.
దొంగలు, గుండాల మాదిరిగా భూములిచ్చిన రైతులపై దాడులా..? జరిగిన సంఘటనకు పోలీసులు పెట్టిన సెక్షన్లకు పొంతన ఉందా..?
రాజధానికి భూములిచ్చిన రైతులను జైలు పాలు చేస్తారా...?  అర్ధరాత్రి ఇళ్ల గోడలు దూకి రైతులను అరెస్ట్ చేస్తారా..? మహిళలు, వృద్దులను భయభ్రాంతులను చేస్తారా..? 6గురు రైతులపై 7సెక్షన్లు నమోదు చేస్తారా..? అర్ధరాత్రి హడావుడిగా జైలుకు తరలిస్తారా..?
రాష్ట్రం కోసం భూములు త్యాగాలు చేసిన రైతులపై ఇంత అమానుషమా..? 33వేల ఎకరాలు అందజేసిన రైతులను పెయిడ్ ఆర్టిస్ట్ లంటారా..?  13రోజులుగా వేలాది రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా పట్టించుకోరా..?  వెంకటపాలెం,నెక్కల్లు,మోదుగ లంకపాలెం,వెలగపూడికి చెందిన 6గురు రైతుల అరెస్ట్ అప్రజాస్వామికమని చంద్రబాబు ధ్వజమెత్తారు.  రైతుల ఆందోళనలను వేలాది పోలీసులతో అణిచివేయాలనుకోవడం ప్రభుత్వ అవివేకమే అన్నారు. 


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా