రోడ్డు ప్రమాదంలో ఆడిట్ అధికారి మృతి
విజయవాడ : కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న యాసిడ్ ట్యాంకర్‌ను ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో యాసిడ్ పడి ఆడిట్ అధికారి రాగమంజీర మీద పడింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే అక్కడున్న స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాగమంజీర మృతి చెందారు. ఈ ఘటనలో ఆమె భర్తకు కూడా తీవ్రగాయాలు కావడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతిచెందిన అధికారిది విశాఖ జిల్లా పెందుర్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యప్తు చేపట్టారు. గ్రూప్ 1 ఆడిట్ ఆఫీసర్‌గా రాగమంజీర ఇబ్రహీంపట్నంలో డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ ఆడిట్ కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిటర్ గావిధులు నిర్వహిస్తున్నారు.
Comments
Post a Comment