పెద్దలు ఊరికే చెప్పలేదు ఇది పెరట్లో ఉందటే ఆరోగ్యమే...
తులసి ప్రతి ఇంట్లో ఎంతో పవిత్రంగా పెట్టుకునే మొక్క. హిందువులు లక్ష్మీదేవి రూపంగా తులసి మొక్కను కొలుస్తారు. ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా భారతీయులు తులసిని తమ ఇళ్ల ముందు కోటగా కట్టి కొలుచుకుంటున్నారు. తులసి ఇంట్లో ఉంటే పిల్లలకు ఏ గ్రహదోషాలూ అంటవని పూర్వీకుల నమ్మకం. తులసి రెండు రకాలు. ఎర్రపూలు పూసే మొక్కను కృష్ణతులసి అని, తెల్లపూలు పూస్తే లక్ష్మీ తులసి అని పిలుస్తుంటారు.
తులసి ఆకుల వల్ల మనం చాలా జబ్బుల్ని దూరం చేసుకోవచ్చు. ఈ తులసి తన సహజ రంగును కోల్పోవడమో, ఆకులు సడన్ గా ఎండిపోవడమో లేదా రాలిపోవడమో జరుగుతుంది. ఈ మార్పులను బట్టి ఇంట్లో వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చని పండితులు చెబుతుంటారు. తులసి చెట్టులో మార్పులు మన భవిష్యత్తును సూచిస్తాయన్న నమ్మకం చాలా మందిలో ఉంది.
తులసిలో విటమిన్ ఏ, సీ, కేతోపాటూ కాల్షియం, జింక్, ఐరన్, క్లోరోఫిల్ సమృద్ధిగా లభిస్తాయి. అందుకే ఈ మొక్కను మందుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీని ఆకులు, పువ్వులు, గింజలు అన్నీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. తులసి మొక్కకు పూసే తాజా పూలు బ్రాంకైటిస్ సమస్యను దూరం చేస్తాయి. మలేరియా ఉన్న వారు ఈ మొక్క ఆకులు, గింజల్ని... మిరియాలతో కలిపి తీసుకోవాలి. డయేరియా, వికారం, వాల్టింగ్స్ వచ్చేవారు ఈ మొక్క ఆకుల్ని తింటే చాలు ఇక సమస్య ఉండదు. కడుపులో అల్సర్లు, కళ్ల సమస్యలకు ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది.
చర్మంపై మొటిమలు, మచ్చల్ని తులసి మటుమాయం చెయ్యగలదు. డయాబెటిస్ ఉన్న వారికి తులసి చక్కటి విరుగుడులా పనిచేస్తుంది. రకరకాల కేన్సర్ల బారిన పడకుండా కాపాడుతుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటైన కాలేయాన్ని కాపాడుతుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతూ మానసిక ఒత్తిళ్లను తగ్గిస్తుంది. శ్వాసకోశ సంబంధ సమస్యల్ని దూరం చేస్తుంది. దంతాలను కాపాడుతుంది.
తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు బాగా ఉన్నాయి. శరీరంలో మంటలు, నొప్పులు, వాపులు, దురదల్ని తగ్గిస్తుంది. ఎముకల నొప్పుల నుంచి వేగంగా సాంత్వననిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా సహకరిస్తుంది. గుండె ఆరోగాన్ని కాపాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-వైరల్ గా పనిచేస్తుంది. రేడియేషన్ దుష్పరిణామాలు శరీరంపై పడకుండా పరిరక్షిస్తుంది. శుక్రకణాల సంఖ్యను పెంచి, సంతాన సాఫల్యతకు మేలు చేస్తుంది.
జుట్టు సమస్యలకు అద్భుత పరిష్కారంగా తులసి పనిచేస్తోంది. జుట్టు తెల్లబడటం, కుదుళ్లు బలహీనపడటం, చుండ్రు వంటి సమస్యలకు చక్కటి మందులా తులసి ప్రభావం చూపిస్తుంది. వెంట్రుకలు రాలిపోకుండా కాపాడుతుంది. గొంతునొప్పి, దగ్గును తులసి నివారిస్తుంది. బరువు తగ్గడంలో కూడా సహకరిస్తుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నందువల్ల తులసి ఆకులు, పూలు, గింజల్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఈ ఫలితాల్ని పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Comments
Post a Comment