మీసేవ మహాధర్నాకు అనూహ్య స్పందన...
ఉదృతం అవుతున్న ఆందోళనలు...
ఆపరేటర్ల ఆవేదనకు అన్న వర్గాల మద్దతు...
విజయవాడ (జనహృదయం) : రాష్ట్ర రాజధాని విజయవాడలో తల పెట్టిన మహా ధర్నాకు అనూహ్య స్పందన లభించింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో మీ సేవా ఆపరేటర్‌లు చేస్తున్న బంద్ ఏడవ రోజుకు చేరుకుంది గత 15 ఏళ్లుగా మీసేవ నమ్ముకొని జీవనం గడుపుతున్న తమ బ్రతుకులు రోడ్డుపాలు చేయొద్దని తమకు బ్రతుకు భరోసా కల్పించాలని ఆపరేటర్లు ఆందోళన చేపట్టారు. ఈమేరకు రాజధానిలో మహాధర్నాకు సమాయత్తమయ్యారు దీంతో ఏళ్ల తరబడి మీసేవ పై ఆధారపడి తమ లావాదేవీలు నిర్వహిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ప్రతి చిన్న అవసరానికి ఆధారపడడం అలవాటుగా చేసుకున్న జనం ఆవేదన చెందుతున్నారు వెంటనే మీ సేవా ఆపరేటర్ సమస్యలు పరిష్కరించి యధావిధిగా లావాదేవీలు సాగించాలని వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు
కాగా మీసేవ బందుకు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య మద్దతు లభిస్తోంది 13 జిల్లాల వ్యాప్తంగా మండలాలు జిల్లా కేంద్రం రాష్ట్ర రాజధానిలో సైతం బంద్ ప్రభావం తీవ్రరూపం దాల్చుతూ ఆందోళన మిన్నంటితోంది. దశలవారీగా ప్రారంభమైన ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది రాష్ట్రంలో ఏ మూల చూసినా మీసేవ బంద్ ఛాయలు అలుముకొని ఆందోళనలు ఉద్ధ తంగా సాగుతున్నాయి. నిర్వాహకులంతా తమ మనుగడకోసం 15ఏళ్లలో తొలిసారి వీధికెక్కారు. చాలీ చాలని కమీషన్లతో మీసేవలనే నమ్ముకొని వాటి ఆదారంగా జీవనం సాగిస్తున్న కుటుంబాలు నేడు ప్రభుత్వ నిర్ణయంతో ప్రశ్నార్ధకంగా మారనున్నాయి. మారుమూల పల్లెల నుంచి పట్టణాల వరకు విస్తరించి ఉన్న మీసేవ కేంద్రాలు రాష్ట్రంలో 11 వేలకు పైగా 13 జిల్లాలలోను విస్తరించి ఉన్నాయి. వీటిని పై సుమారు రెండు లక్షల మంది వరకు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సచివాలయ వ్యవస్థతో మీసేవల మనుగడ ప్రశ్నార్ధకం అయ్యే ప్రమాదం పొంచి ఉండడంతో గత ఆరు నెలలుగా నిర్వాహకులు స్థానికంగా ఉండే ఎమ్మార్వో మొదలుకొని సిఎం వరకు అధికారులు ప్రజాప్రతినిదులకు వనతి పత్రాలు ఇస్తూ దశలవారీగా తమ గోడు వినిపించారు. అయినప్పటికీ ఏఒక్కరూ స్పందించకపోవడంతో ఆందోళన బాట పట్టారు. మండల స్థాయిలో ప్రారంభించిన ఆందోళన రాజదానికి పాకింది. వేలాది మంది మీ సేవ నిర్వాహకులు విజయవాడ చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తూ మహా ధర్నా చేపట్టారు. నాటి పాదయాత్ర సమయంలో తమకు ఉపాధి దిశగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన నేటి ముఖ్యమంత్రి అభయానికై లక్షలాది మంది ఆత్రుతగా ఎదురుచూస్తూ తమ ఆవేదనను వివిద రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. న్యామపరమైన తమ జీవనోపాధి డిమాండ్‌తో ప్రధానంగా సాగుతున్న ఈ ఉద్యమానికి అన్న వర్గాల వారి మద్దతు లభిస్తోంది.
గత వారంరోజులుగా సాగుతున్న మీసేవ బంద్‌తో నిత్యం వాటిపై ఆధారపడే వినియోగదారులు నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో పౌరసేవలన్నీ నిలిచిపోవడంతో జనం వెతలు వర్ణణాతీతంగా మారాయి. లావాదేవీలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో యువతరం తీవ్ర ఇబ్బందులెదుర్కొంటోంది. నెలాఖరు సమయం కావడంతో బిల్లుల చెల్లింపు ఇతర లావాదేవీలకు మీసేవ పైనే ఆధారపడే గ్రామీణులంతా ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మీ సేవా నిర్వాహకులకు న్యాయం చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.
Comments
Post a Comment