మీ చర్మ నిగారిమ్పుకోసం...
నిమ్మరసంతో చర్మాన్ని కాంతిమంతం చేసుకోవచ్చు. శరీరంపై ఉన్న మురికిని నిమ్మరసం పోగొడుతుంది. ఇందులో ఎక్కువ మోతాదులో ఉండే సిట్రిక్ యాసిడ్, సి విటమిన్లు చర్మసౌందర్యం మీద మంచి ఫలితం చూపుతాయి.
వయసు పైబడటం వల్ల వచ్చే మచ్చలతోపాటు నల్లమచ్చలు, టానింగ్, చర్మం కాంతి విహీనం కావడం, చర్మం మీద ఏర్పడే ఇతరత్రా మచ్చలను నిమ్మరసం పోగొడుతుంది.
పొడిబారిన చర్మంపై, మృతకణాలున్న పెదాలపై నిమ్మరసం రాస్తే చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. అందుకే రాత్రి నిద్ర పోయే ముందు పెదాలకు నిమ్మరసం రాసుకుని పడుకోవాలి. పొద్దున్న లేచిన తర్వాత పెదాలను శుభ్రంగా కడిగేసుకోవాలి. అయితే పెదాలపై పగుళ్లు ఉన్నప్పుడు మటుకు నిమ్మరసం రాస్తే మంట పుడుతుంది.
కొందరికి మోకాళ్లు, మోచేతుల దగ్గర చర్మం నల్లగా ఉంటుంది. ఆ భాగాల్లో సగం నిమ్మచెక్కతో బాగా రుద్దితే, చర్మం రంగులో మార్పు కనపడుతుంది.
" alt="" aria-hidden="true" />
నేచురల్ ఆయిల్స్ లో నిమ్మరసం వేసి బాగా కలిపి రాసుకుంటే మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. చర్మం మృదువుగా, పట్టులా మారుతుంది. కొబ్బరినీళ్లు లేదా ఆలివ్ ఆయిల్ లో రెండుమూడు నిమ్మరసం చుక్కలు వేసి రాసుకోవచ్చు.
జిడ్డు చర్మం ఉన్న వారికి యాక్నే తలెత్తే అవకాశం ఉంది. అలాగే బ్లాక్ హెడ్స్, రకరకాల మచ్చలు వస్తాయి. నిమ్మరసంలో యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వాటితో యాక్నే వేగంగా తగ్గుతుంది.
నిమ్మరసంలో కొద్దిగా వంటసోడా వేసి దంతాలు తోముకుంటే తళ తళలాడతాయి. ఆ తర్వాత నోటిని నీళ్లతో బాగా పుక్కిలించడం మాత్రం మరవొద్దు.
Comments
Post a Comment