ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా కె.వెంకట్రామిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో ఇటీవల సంఘం అధ్యక్షుడిగా గెలుపొందిన కె.వెంకట్రామిరెడ్డి నేడు ప్రమాణస్వీకారం చేశారు. వేదపండితుల ఆశీర్వచనాల నడుమ ఘనంగా ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇటీవల ఎన్నికైన సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్. ప్రసాద్, ఉపాధ్యక్షులు శామ్యూల్ జూబ్లి, సుజాత, సంయుక్త కార్యదర్శులు రాజేష్(ఆర్గనైజేషన్), వీరశేఖర్(క్రీడలు), వి.దేవి (మహిళ), అదనపు కార్యదర్శి రమేష్ బాబు, కోశాధికారి ఎం.ప్రసాద్ లు హాజరయ్యారు. పలువురు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛంతో సంఘం అధ్యక్షుడిని, ఇతర సభ్యులను అభినందించారు.
Comments
Post a Comment