ఆర్టీసీ కార్మికుల భారీ ర్యాలీ...
ప్రైవేట్ ట్రావెల్స్ అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్
విజయవాడ : ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్మికులు నడుంబిగించారు. బస్ స్టేషన్ల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ బెజవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల ఆర్టీసీ చాల నష్టపోతుందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. అక్రమ రవాణాను అధికారులు అడ్డుకుంటున్నప్పటికీ ఫలితం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రవాణా చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ పోలీస్ కమిషినర్, జిల్లా రవాణా శాఖ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.
Comments
Post a Comment