స్థానిక ఎన్నికలకు సిద్దం అవ్వండి ....


విశాఖపట్నం :  రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం నాడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆయన తన కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన గతంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అవలంభించిన పద్ధతులనే ఈ ఎన్నికల్లో కూడా పాటించనున్నట్లు తెలిపారు.  ఎన్నికల నిర్వహణ కై కేటాయించనున్న సిబ్బందిని ర్యాండమైజేషన్ పద్ధతిలో కంప్యూటర్ ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు. ఎన్నికల విధుల్లో స్థానిక ఉద్యోగులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.ఒక మండలంలోని ఎంపీటీసీ, జెడ్ పి టి సి ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల లో దశలవారీగా ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. బ్యాలెట్ బాక్సులను మరమ్మతులు చేయించి సిద్ధం చేసుకోవాలని తెలిపారు.



జిల్లా పరిషత్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈవో స్థాయి అధికారులు వ్యవహరిస్తారని తెలిపారు. మండల పరిషత్ ఎన్నికల్లో మండల ప్రత్యేక అధికారులు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు.పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. ఆదర్శ ప్రవర్తనా నియమావళి ( మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) గత శాసనసభ, పార్లమెంటు ఎన్నికల మాదిరే ఉంటుందని తెలిపారు. ఎన్నికలలో సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు ఉంటారని తెలిపారు. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు ప్రతి 3 రోజులకు ఒకసారి సమర్పించే ఖర్చు వివరాలను రిటర్నింగ్ అధికారులు తమ బృందాలతో పరిశీలిస్తారని తెలిపారు. ఈ బృందాలలో లోకల్ ఫండ్ ఆడిటర్లు ఇతర సంబంధిత అధికారులు ఉంటారని తెలిపారు.ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎమ్మార్వో, ఎంపీడీవో, స్టేషన్ హౌస్ ఆఫీసర్ లు పోలింగ్ స్టేషన్లను క్రిటికల్, హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ లుగా వర్గీకరించుకోవాలని, ఆ ప్రకారం బలగాలను కేటాయించాలని తెలిపారు.


నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఓటు వేసేందుకు అనువైన వాతావరణాన్ని నెలకొల్పాలని తెలిపారు.ఇంజనీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసి, తగు శిక్షణ ఇచ్చి, సాఫ్ట్ వేర్ అందజేసి వెబ్ కాస్టింగ్ చేయించాలని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తి అయిందని తెలిపారు. రిజర్వేషన్ వివరాలను మూడు, నాలుగు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు.  ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు.  దివ్యాంగ ఓటర్లకు అనుకూలంగా ఉండేటట్టుగా పోలింగ్ స్టేషన్లను తీర్చిదిద్దుతామని తెలిపారు.  పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ మాట్లాడుతూ జనవరి 5వ తేదీలోగా ఎన్నికల మెటీరియల్ ను జిల్లాలకు పంపిస్తామని తెలిపారు.  ఎన్నికల నిర్వహణలో డేటాను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ చేస్తామని తెలిపారు.  జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ పెద్ద బ్యాలెట్ బాక్సులు కావాలని తెలిపారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఎంపీడీవో, ఈవో పి ఆర్ డి పోస్టులను భర్తీ చేయాలని, తద్వారా ఎన్నికలను సజావుగా నిర్వహించగలమని తెలిపారు.  ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనరు రాజీవ్ కుమార్ మీనా, రూరల్ ఎస్పి ఏ. బాబూజీ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగార్జున సాగర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా