ఢిల్లీ ని కప్పేసిన పొగ మంచు

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీని సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కప్పేయడంతో పలు విమానాలు, 30 రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం జరిగింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు ప్రభావంతో సోమవారం ఉదయం మూడు విమాన సర్వీసులను దారి మళ్లించారు. పలు విమానసర్వీసుల రాకపోకల్లో తీవ్ర జాప్యం నెలకొంది.
ఢిల్లీ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు సాగించాల్సిన 30 రైళ్లు ఆలస్యమయ్యాయి. పొగమంచు వల్ల విమానాల రాకపోకల్లో జాప్యం జరిగిందని, విమాన సర్వీసులను రద్దు చేయలేదని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు చెప్పారు. ఢిల్లీలో సోమవారం ఉష్ణోగ్రత 2.5 డిగ్రీల సెల్షియస్ కు పడిపోయింది. చలిగాలుల ప్రభావం వల్ల ఢిల్లీలో వాతావరణశాఖ అధికారులు రెడ్ వార్నింగ్ జారీ చేశారు.
నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద, ఫరీదాబాద్ నగరాల్లో ఈ నెల 31వతేదీన వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. తీవ్ర చలిగాలుల ప్రభావం వల్ల ప్రయాణికులు, ఇళ్లు లేని వారు ఆనంద్ విహార్, సరాయ్ కాలేఖాన్ ప్రాంతాల్లోని నైట్ షెల్టర్లలో తలదాచుకున్నారు. కళింది కుంజ్, మయూర్ విహార్ ఫేజ్ -1, ఆర్ కే పురం, ఢిల్లీ కంటోన్మెంటు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా