పాన్ ఆధార్ లింక్ గడువు పెంపు
పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ గడువును పెంచుతూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నిర్ణయం తీసుకుంది. తుది గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు తెలిపింది. డిసెంబర్ 31 లోగా పాన్‌ను ఆధార్‌తో జత చేసుకోవాలని లేదంటే ఆది క్యాన్సిల్ అవుతుందని గతంలో పేర్కొంది. అయితే తాజా గడువు పెంచుతున్నట్లు పేర్కొంది. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానానికి మరోమూడు నెలలు పెంచింది.
వాస్తవానికి అక్కడ ఒక ప్రవాస భారతీయుడికి (ఎన్‌ఆర్‌ఐ) ఆధార్ కార్డు లేదా పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) అవసరం లేదు, కానీ వాటిని మార్చి 31 లోగా లింక్ చేయడం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక వ్యవహారాలతో కూడిన ఒక ఎన్నారై పాన్ కార్డు మరియు ఆధార్ రెండింటినీ కలిగి ఉండాలని సూచించారు.
Comments
Post a Comment