మాజీ ఎమ్మెల్యే మృతి పై చంద్రబాబు సంతాపం
అమరావతి: ఏలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి (కోట రామారావు) మృతి పట్ల ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఎంతో భవిష్యత్తు ఉన్న బుజ్జి, చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరమన్నారు. మున్సిపల్ చైర్మన్‌గా, శాసనసభ్యునిగా ఏలూరు అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. స్మార్ట్‌సిటీగా ఏలూరును చేయాలని పరితపించారని. రోడ్లు, వంతెనలు, అంగన్వాడీ, పంచాయతీ అదనపు తరగతి భవనాలు అనేకం నిర్మించారని గుర్తు చేశారు. బడేటి బుజ్జి మృతి ఏలూరు నియోజకవర్గానికే కాకుండా తెలుగుదేశం పార్టీకే తీరని లోటని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
Comments
Post a Comment