జలుబు, దగ్గు నిర్లక్ష్యం చేయొద్దు సుమా..
జలుబు, దగ్గును నిర్లక్ష్యం చేస్తే? సాధారణ జలుబు, దగ్గు కదా అని నిర్లక్ష్యం చేసినా, మందుల షాపుల్లో తోచిన మాత్రలు కొనుక్కుని వాడుతూ ఉండిపోయినా... ఈ ఇబ్బందులు తగ్గకపోగా, మరింత లోతుగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఫలితంగా జ్వరం, ఎగువ, దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ముక్కుకు సంబంధించి సైనసైటిస్, చెవి నుంచి నీరు, చీరు కారడం మొదలైన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.
ఎలర్జీ తత్వం, లక్షణాలను బట్టి.... ముక్కు, గొంతు, చెవులకు సంబంధించిన ఎలర్జీ లక్షణాలు, తత్వాలు వేర్వేరుగా ఉంటాయి. కొందరికి వర్షాకాలం, లేదా చలికాలం, వేసవి కాలాల్లోనే సమస్యలు వేధిస్తే, మరికొందరికి ఏడాది పొడవునా వేధిస్తాయి. కాబట్టి ఎలర్జీ కారకాలతో పాటు ఎలర్జీ రకం కూడా కనిపెట్టి తదనుగుణంగా చికిత్స తీసుకోవాలి. ఎలర్జీ ఉంది అని గ్రహించడానికి తోడ్పడే లక్షణాలు ఇవే!
ఆగకుండా తుమ్ములు, ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆగకుండా 20 నుంచి 30 సార్లు తుమ్ముతూ ఉండడం ముక్కు, కళ్ల నుంచి నీరు కారడం మాట్లాడేటప్పుడు, రాత్రి వేళల్లో దగ్గు ఎక్కువగా ఉండడం వీటికి దూరంగా ఉంటే మేలు! ఎలర్జీ కారకాలకు దూరంగా ఉండడమే మొట్టమొదటి ఎలర్జీ పరిష్కారం. ఇందుకోసం... ఉదయం 7కు ముందు, రాత్రి 7 తర్వాత చల్లని వాతావరణంలో బయటకు వెళ్లకూడదు ముక్కుకు మాస్క్ ధరించాలి చల్లనీళ్లు, పానీయాలు, ఐస్ క్రీమ్ లకు దూరంగా ఉండాలి ఫుడ్ ఎలర్జీ ఉంటే, ఏ పదార్థం వల్ల ఎలర్జీ వస్తుందో స్వయంగా పరిశీలించి వాటికి దూరంగా ఉండాలి ఎలర్జీ చికిత్స!
ఎలర్జీ వేధించే కాలపరిమితి, తీవ్రతలను బట్టి, ఆ మందులకు రోగుల స్పందనను బట్టి తీసుకోవలసిన యాంటా హిస్టమిన్ల చికిత్స ఆధారపడి ఉంటుంది. ఏ మందు, ఎంతకాలం, ఎంత మోతాదుతో ఉపయోగించాలో వైద్యులు మాత్రమే నిర్ణయించగలుగుతారు. కాబట్టి ఎలర్జీ ఉన్న వాళ్లు సొంత వైద్యం జోలికి వెళ్లకుండా వైద్యులను కలిసి సరైన చికిత్స తీసుకోవాలి.
Comments
Post a Comment