ఎండు ద్రాక్షతో ప్రయోజనాలెన్నో...
వర్షాకాలంతో పోల్చితే... శీతాకాలంలో దొరికే పండ్లు తక్కువ. ఇలాంటి సమయంలో... ఎండిన ద్రాక్ష (కిస్మిస్) ఆ లోటును తీర్చుతాయి. కిస్ మిస్ లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇతర పోషకాలుంటాయి. పైగా వీటిని తింటే... ఫ్యాట్, కొలెస్టాల్ సమస్య కూడా ఉండదు. ఎండిన ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే మిగతా డ్రైఫ్రూట్స్ కంటే వీటిలో ఫెనాల్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి చలికాలంలో తప్పనిసరిగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. డైరెక్టుగా తింటే పుల్లగా ఉన్నట్లు అనిపిస్తే... పాలలో, ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవచ్చు. తద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
జీర్ణక్రియకు మేలు : కిస్మిలో ఫైబర్ ఎక్కువ. ఇవి మలబద్దకాన్ని నివారించి, తిన్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తాయి. పేగులు, పొట్టలో విష వ్యర్థాల్ని తరిమికొడతాయి. అందువల్ల బయటకు కనిపించని పొట్టను శుభ్రం చేసుకోవాలంటే... కిస్ మిస్ తినేయడమే.
ఏసీడీటీకి చెక్ : ఎండిన ద్రాక్షలో ఐరన్, పొటాషియం , కాపర్ (రాగి), మెగ్నీషియం ఉంటాయి. ఇవి పొట్టలో యాసిడ్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి. అందువల్ల ACDT లాంటి సమస్యలు తగ్గుతాయి.
గుండెకు మేలు : కిస్మిలో సోడియం తక్కువగా ఉంటుంది. అలాగే ఇందులోని పొటాషియం కండరాలు, గుండె కండర కణాలకు మేలు చేస్తుంది. గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే... ఎండిన ద్రాక్షను రెగ్యులర్ గా తింటూ ఉండాలి.
కాన్సర్ కి చెక్ : ఎండిన ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు... కేన్సర్ వైరస్ అంతు చూస్తాయి. చర్మ కణాల్లోకి రాబోతున్న వైరస్ ను ఎంట్రీ దగ్గరే ఆపేసి.... బయటకు పంపేస్తాయి. కాన్సర్ కణాల వృద్ధి, పుండ్ల పెరుగుదల వంటివాటిని ఇవి అడ్డుకుంటాయి.
కంటికి మేలు : కిస్ మిలోని పాలీఫెనాల్స్ అనే ప్రత్యేక యాంటీఆక్సిడెంట్ ఎంత మంచిదంటే... మన కళ్లను కాపాడుతుంది. కంటి సమస్యలకు చెక్ పెడుతుంది. కాటరాక్ట్ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది.
చర్మానికి ప్రయోజనం : ఎండిన ద్రాక్షలో విటమిన్ సీ, సెలెనియం, జింక్ వంటివి ఉంటాయి. ఇవి చర్మాన్ని కాపాడతాయి. యంగ్ ఏజ్ ఉండేలా చేస్తాయి. చర్మం పాడవకుండా, చర్మ కణాలు దెబ్బతినకుండా చేసి... ముసలి తనం త్వరగా రాకుండా చేస్తాయి. ఒక్క విషయం : ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ఎండిన ద్రాక్షను మరీ ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే వీటిలో తీపి, కేలరీలు ఎక్కువ. అతిగా తింటే బరువు పెరుగుతారు. మరో విషయం కిస్ మిస్ ఎక్కువగా తింటే... ఫైబర్ ఎక్కువై కడుపులో గడబిడ మొదలవుతుంది. పొట్ట ఉబ్బడం, గ్యాస్ వంటి రకరకాల సమస్యలొస్తాయి. అందువల్ల రోజూ ఓ 20కి మించకుండా తింటే మేలే జరుగుతుంది.
Comments
Post a Comment