పిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందస్తారు...
డీజీపీ గౌతమ్ సవాంగ్ ..
మంగళగిరి : ప్రజలు నుంచి ఫిర్యాదు అందగానే పోలీసులు వెంటనే స్పందిస్తున్నారని డిజిపి డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆదివారం డీజీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గుట్కా, గంజాయి, అక్రమంగా ఇసుక తరలింపు వంటి విషయాల్లో పోలీసులు కఠినంగా ఉంటున్నామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి' నుండి మహిళల కు రక్షణ మరింత పెరిగిందని, దిశ చట్టం వచ్చిన తర్వాత మహిళలకు భద్రత మరింత పెంచడంతో పాటు శిక్షలను మరింత కఠినతరం చేసామన్నారు. దేశంలోనే ఏపీ పోలీసులు మంచి పేరు వచిందన్నారు. ఈమేరకు ఆరు అవార్డులు వచ్చాయని, క్రైం రేటు గత ఏడాది కంటే 6 శాతం తగ్గిందిని చెప్పారు. మావోయిస్టుల యాక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సక్సెస్ అవుతున్నారని స్పందన ద్వారా వచ్చే ఫిర్యాదులను చాలా తొందరగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.
సైబర్ క్రైం కింద 122 కేసులు కట్టాము. వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాము. మైనర్ బాలికలను మోసగించే వారిపై ఫోక్సో చట్టం కింద కేసు పెడుతున్నాం. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. రోడ్డు ప్రమాదాలు గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువగా జరిగాయి. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందిని డిజిపి అన్నారు. ఈసమావేశానికి విజయవాడ గుంటూరు పోలీస్ కమిషనర్లతోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరైయ్యారు.
Comments
Post a Comment