చర్మ సౌందర్యానికి ఇలా ప్రయత్నించండి ....
అందంగా కనిపించాలంటే చర్మం ఆరోగ్యంగా ఉండాలి. నునుపుగా, తేమతో, కాంతులీనుతూ ఉండే చర్మం కోసం సౌందర్య చికిత్సలకు బదులుగా పోషకభరిత ఆహారం మీద ఆధారపడాలి. అలాంటి స్కిన్ ఫుడ్ ఇదే! బాదం: విటమిన్ ఇ తో నిండి ఉండే
బాదం పప్పులోని యాంటీఆక్సిడెంట్లు అతినీలలోహిత కిరణాల నుంచి చర్మ కణాలకు రక్షణ కల్పిస్తాయి. కాబట్టి ప్రతిరోజూ గుప్పెడు బాదం పప్పు తినాలి. క్యారెట్లు: ఈ ఆరెంజ్ రంగు అద్భుతాలు చర్మపు బాహ్య పొరలో అవసరానికి మించి కణాలు పెరగకుండా నియంత్రిస్తాయి. ఫలితంగా చర్మం నునుపుగా ఉంటుంది.
గ్రీన్ టీ: గ్రీన్ టీ ఆకులు మరిగేటప్పుడు విడుదలయ్యే కోటాచి లోని యాంటీఆక్సిడెంట్లు చర్మపు క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించటంతో పాటు చర్మానికి పోషకాలను అందిస్తాయి. టమేటాలు: వీటిలోని లైకోపిన్, ఫొటోకెమికల్స్ చర్మానికి వృద్దాప్య లక్షణాలను తెచ్చిపెట్టే అతినీలలోహిత కిరణాల్లోని ఫ్రీ ర్యాడికల్స్ నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తాయి.
Comments
Post a Comment