ఈ గింజలు తింటే బిపి షుగర్ కంట్రోల్...

సబ్జా విత్తనాల్లో విలువైన పోషకాలు ఉన్నాయి. మధుమేహులకు ఈ పోషకాలు రెట్టింపు మేలు చేస్తాయి. గ్లూకోజ్, ఇన్సులిన్ టాలరెన్స్ ను పెంచుతాయి. సబ్జా తో ఉన్న ఇతరత్రా ఉపయోగాలు ఏవంటే.... శరీరంలో తలెత్తే పలు రకాల ఇన్ ఫ్లమేషన్లను ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ తో అదుపు చేయవచ్చు. ఈ పోషకం సబ్జా లో ఉంటుంది. వంద గ్రాములు సబా విత్తనాల్లో 17.8 గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అలాగే సబ్జా విత్తనాల్లో అధికంగా ఉండే పీచు కూడా ఇప్లమేషన్ ను తగ్గిస్తుంది. ఈ విత్తనాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి.



రక్తపోటు కలిగి ఉన్న మధుమేహులు ప్రతి రోజూ క్రమం తప్పకుండా సబ్జా విత్తనాలు తింటే వారి సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ తగ్గట్టు పలు పరిశోధనల్లో రుజువైంది. రక్తపోటు తగ్గితే గుండె మీద పడే భారం కూడా తగ్గుతుంది. కాబట్టి సబ్జా విత్తనాలు తీసుకోవడం ద్వారా గుండె జబ్బులను అరికట్టవచ్చు. సబ్జా విత్తనాలను సరిపడా నీళ్లలో కనీసం 30 నిమిషాల నుంచి 2 గంటలపాటు నానబెట్టాలి. సబ్జా విత్తనాలను నీళ్లను ఎక్కువగా పీల్చుకుంటాయి. కాబట్టి రోజంతా తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా