అమరావతి పరిరక్షణ సమితి అఖిలపక్షం భేటీ...
అమరావతి పరిరక్షణ సమితి అఖిలపక్షం భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నగరంలో శుక్రవారం క్రెడయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ రాజధాని అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో తరలించవద్దని ఏకగ్రీవంగా ప్రభుత్వాన్ని అఖిలపక్ష సమావేశం కోరింది. శనివారం ఉదయం నుంచి విజయవాడ ధర్నా చౌక్ లో అమరావతి పరిరక్షణ సమితి ధర్నా నిర్వహిస్తామన్నారు. 27న రాష్ట్రవ్యాప్తంగా మానహారాలకు అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చారు. నల్లబ్యాడ్జీలు కట్టుకుని అందరూ మానవహారాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మంత్రివర్గ సమావేశంలో రాజధాని తరలింపుపై నిర్ణయం తీసుకోరాదని ప్రభుత్వానికి అఖిలపక్షం డిమాండ్ చేసింది. కాదని నిర్ణయం తీసుకుంటే సమావేశమై భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రయోజనాలు దెబ్బతినే విధంగా జి.ఎన్.రావు కమిటీ ఇచ్చిన నివేదిక, అధికార వికేంద్రీకరణ సాకుతో రాజధాని తరలింపుకు తీసుకున్న ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంపై అన్ని వర్తక సంఘాలు, కార్మిక సంఘాలు, నిర్మాణ రంగ సంస్థలు సంయుక్తంగా నిరసన తెలియజేస్తున్నాయన్నారు. యాక్షన్ కమిటీ తరఫున రాజకీయ, కులమతాలకు అతీతంగా మన ప్రాంత ప్రయోజనాలే లక్ష్యంగా ఈ కమిటీ ప్రత్యక్ష కార్యాచరణ చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి క్రెడయ్ ఛైర్మన్ ఎ.శివారెడ్డి, ప్రెసిడెంట్ సిహెచ్ సుధాకర్, క్రెడయ్ విజయవాడ ప్రెసిడెంట్ ఆర్.వి.స్వామి, జనరల్ సెక్రటరీ డి.రాంబాబు, ఐలా ఛైర్మన్ ఎస్.దుర్గాప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పోతిన వెంకట మహేష్, సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసీరెడ్డి, టీడీపీ నాయకులు పట్టాభి, ఎంఆర్ ఎస్ నాయకులు పేరుపోగు వెంకటేశ్వరరావు తదితర పార్టీలు, సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావాన్ని తెలిపారు.
Comments
Post a Comment