రొజూ ఈ టీ త్రాగి బరువు తగ్గండి...

       మీరు గ్రీన్ టీ ప్రయోజనాలు తెలియనివారుండరు.  ఈ ఏడాది ఎక్కువగా వినియోగంలోకి వచ్చినది గ్రీన్ కాఫీ. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది డయాబెటిస్ ను కంట్రోల్ చెయ్యగలదు. దీని అద్భుతమైన ప్రయోజనాలు తెలిసి... ప్రపంచ దేశాలన్నీ కోట్లు ఖర్చుపెట్టి గ్రీన్ కాఫీని కొంటున్నాయి. గ్రీన్ కాఫీని గ్రీన్ కాఫీ గింజల పొడి నుంచి తయారుచేస్తారు. మామూలుగా కాఫీ గింజల్ని వేయిస్తారు (రోస్ట్). గ్రీన్ కాఫీ గింజలను రోస్ట్ చెయ్యరు. రోస్ట్ చేసే గింజలు జీవం కోల్పోతాయి. వాటిలోని క్లోరోజెనిక్ యాసిడ్ గాలిలో ఆవిరైపోతుంది. కెఫైన్ మాత్రం రోస్టింగ్ ప్రక్రియకు ప్రభావితం కాకుండా అలాగే ఉంటుంది. అందువల్ల రోస్ట్ చేసిన కాఫీ గింజల్లో కెఫైన్ ఉంటుంది కానీ ముఖ్యమైన క్లోరోజెనిక్ యాసిడ్ మాత్రం ఉండదు. మన శరీరాన్ని క్రమపద్ధతిలో (మెటబాలిజం) ఉంచడానికీ, షుగర్ లెవెల్సను కంట్రోల్ చెయ్యడానికి ఈ క్లోరోజెనిక్ యాసిడ్ అద్భుతంగా పనిచేస్తోంది.


" alt="" aria-hidden="true" />


         బరువు తగ్గుదల, డయాబెటిస్ కంట్రోల్ : క్లోరోజెనిక్ యాసిడ్ కి కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్ధాలు)ని పీల్చేసే లక్షణం ఉంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రో చేస్తుంది. ఈ రెండు లక్షణాల వల్ల మనం బరువు తగ్గుతాం. డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. ఈ యాసిడ్ శరీరంలోని కొవ్వును కరిగించేసి, మనకు తీరైన శరీరాకృతిని ఇస్తుంది.


         యాంటీఆక్సిడెంట్ గుణాలు : ఈ రోజుల్లో మనకు అడ్డమైన రోగాలొస్తున్నాయి. వాటి బారిన పడకుండా ఉండాలంటే రోజూ గ్రీన్ కాఫీ తాగేస్తే సరి. ఎందుకంటే ఇందులో శరీరంలోకి విష వ్యర్థాల్ని రాకుండా అడ్డుకునే గుణాలున్నాయి. ఇవి బీపీని కూడా తగ్గిస్తాయి. మతిమరపుకి దారితీసే అల్జీమర్స్ వ్యాధి ఉన్న వారికి ఇప్పుడు గ్రీన్ కాఫీ తాగిస్తున్నారు. కొంతవరకూ ప్రయోజనం కనిపిస్తోందట. ఆ దిశగా మరిన్ని ప్రయోగాలు, పరిశోధనలు జరుగుతున్నాయి.


         కెఫైతో జాగ్రత్త : కాఫీలో ఎంత కెఫైన్ ఉంటుందో, గ్రీన్ కాఫీలోనూ అంతే కెఫైన్ ఉంటుంది. అందువల్ల ఈ కాఫీని అతిగా తాగకూడదు. రోజుకు రెండు కప్పులు చాలు. అంటే రోజుకు 200 నుంచి 400 మిల్లీగ్రాముల కాఫీ పొడి మించి వాడకపోవడం మేలు.ఎక్కువగా తాగితే కెఫైన్ వల్ల నిద్రలేమి (నిద్ర సరిగా పట్టకపోవడం) వస్తుంది. విశ్రాంతి లేనట్లు (restlessness) అనిపిస్తుంది. పొట్టలో గడబిడ, వికారం, వాల్టింగ్ (vomiting), గుండె వేగంగా కొట్టుకొనడం, ఆతృత, తలనొప్పి, చెవుల్లో రివ్వుమని శబ్దం, గుండె కొట్టుకునే వేగం లయ తప్పడం లాంటి సమస్యలొస్తాయి. అయితే ఇవన్నీ రోజుకు ఐదారు కప్పులు తాగేవాళ్లకు వస్తాయి.


       రోజూ రెండు కప్పులు తాగినా సన్న బడుతున్నట్లు అనిపించకపోతే, అప్పుడు చిన్న పాటి ఎక్సర్ సైజులు చెయ్యడం మంచిదే. ఈ కాఫీని కొత్తగా కనుక్కున్నారు. ఇది రోజుకు ఎన్ని కప్పుల దాకా తాగవచ్చో పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి రిపోర్టులు వచ్చే అవకాశాలున్నాయి. అప్పుడు డాక్టర్లు చెప్పినదాన్ని బట్టి సరిపడా డోస్ తీసుకుంటే, బరువు తగ్గడం సమస్యే కాదు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా