భలే చౌకైన బిర్యానీ...
తమిళనాడు : తన హోటల్ కి పాపులారిటీ పెంచుకోవాలని ఓ యజమాని మదిలో మెదిలిన ఆలోచన యమ సక్సెస్ అయ్యింది. భోజన ప్రియులు బిర్యానీకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. దీనికితోడు చికెన్ బిర్యానీకి యమా క్రేజ్. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ తీసి తమకు నచ్చిన రెస్టారెంట్ లో లేదా హోటల్ లో బిర్యానీ బుక్ చేసుకొని తింటున్నారు. బిర్యానీ బుక్ చేసే ముందు ఏ హోటళ్లలో ఆఫర్లు ఉన్నాయి..ఎక్కడ ధర తక్కువ అని వెతుకుతుంటారు. అటువంటి బిర్యానీ కేవలం 15 రూపాయలకే అంటే ఇంక ఎవరైనా ఊరుకుంటారా. ఎగబడి ఎగబడి కొనుకుంటారు. హోటల్ ముందు క్యూ కడతారు. తమిళనాడులో అదే జరిగింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడులోని కోయంబత్తూరులో కొత్తగా ఓ హోటల్ ప్రారంభమైంది. తొందరగా వ్యాపారం అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో హోటల్ యజమాని కొత్తగా ఆలోచించాడు. డిసెంబర్ 25, 26 తేదిలలో బంపర్ ఆఫర్లను ప్రకటించారు. చికెన్ బిర్యానీ 15 రూపాయలకు, ఎగ్ బిర్యానీ 10 రూపాయలకు, ప్లెయిన్ బిర్యానీ 10 రూపాయలకు, పరోటా 5 రూపాయలని ప్రకటించాడు. ఇంకేముంది క్షణాల్లో వందల మంది హోటల్ ముందు వాలిపోయారు. బిర్యానీ కోసం ఎగబడ్డారు. లైన్లు నిలబడి బిర్యానీని కొనుగోలు చేశారు. రెండు రోజుల్లో ఆ హోటల్ కు యమ పబ్లిసిటీ వచ్చింది. అదే విధంగా బిర్యానీ చాలా రుచికరంగా ఉందని, ఆఫర్ తీసేసినా తాము ఇక్కడ కొనుగోలు చేస్తామని భోజన ప్రియులు చెప్పడం విశేషం. తనకు వచ్చిన ఐడియా సక్సెస్ కావడంతో హోటల్ యజమాని పట్టరాని ఆనందం వ్యక్తం చేశాడు.
Comments
Post a Comment