లంబసింగి లో వణికిస్తున్న చలి పులి ...
చింతపల్లి : విశాఖ ఏజెన్సి లంబసింగిని చలి పులి వణికిస్తుంది . గత వారం రోజులుగా బంగాళాఖాతం ఒడిశా తీరాన ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా వాతావణం లో కలిగిన మార్పులతో పడిపోయాయి. . దీంతో సోమవారం ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. చింతపల్లి లో సోమరవం 8.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావన విభాగం శాస్త్రవేత్త సౌజన్య తెలిపారు. సహజంగానే చింతపల్లి కంటే లంబసింగి లో రెండు డిగ్రీలు తక్కువగా నమోదు అవుతుంది. ఈమేరకు లంబసింగి లో ఉష్ణోగ్రత 6డిగ్రీలకు చేరింది . కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడం కారణంగా చలి తీవ్రత పెరిగిపోయింది. అలాగే మంచు కూడా దట్టంగా కురుస్తుంది. తాజా వాతావరణ పరిస్థితులు స్థానిక ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నా పర్యాటకుల సందర్శనకు అనుకూలమైన సమయం. లంబసింగికి 2కిలోమీటర్లు దూరంలో నున్న చెరువుల వెనంలోనూ వాతావరణం బాగుంది. మంచు అందాలు ఆకట్టుకుంటున్నాయి. అలాగే తాజంగి జలాశయం వద్ద పర్యాటకుల కోసం జిప్ లైన్ , సహస క్రీడలు అందుబాటులో ఉన్నాయి . 31రాత్రి లంబసింగి లో జరుపుకోవాలని భావించే పర్యాటకులకు వాతావణం అనుకూలస్తోంది.
Comments
Post a Comment