ఏపీలో ఇసుకడోర్ డెలివరీకి ఏర్పాట్లు
తాడేపల్లి : ఏపీలో ఇసుకను డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇసుక డోర్ డెలివరీ పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లాను ఎంచుకున్నారు. జనవరి 2న ఇసుక డోర్ డెలివరీని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత జనవరి 7న ఉభయ గోదావరి జిల్లాల్లో ఇసుక డోర్ డెలివరీ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా జనవరి 20లోపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇసుక డోర్ డెలివరీ పూర్తి కావాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ రంగం కుదేలైందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 200 పైచిలుకు స్టాక్ యార్డులకు గాను.. 13 యార్డుల్లో బుకింగ్ ఓపెన్ చేసిన కాసేపట్లోనే ఇసుక అయిపోతోందని అధికారులు చెప్పగా.. సమీపంలోని యార్డుల్లో బుకింగ్ కు అవకాశం ఉండేలా చూడాలని ముఖ్య మంత్రి సూచించారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ నాలుగు నెలల్లో నెలకు 15 లక్షల టన్నులు చొప్పున వర్షాకాలం అవసరాల కోసం రిజర్వ్ చేయాలని, 60 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఏపీలో ఇసుకను ఎపీఎండీసీ ద్వారా డోర్ డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
Comments
Post a Comment