ప్లాస్టిక్ రహిత సమాజానికి కృషి చేయాలి .. ఐటీడీఏ పి ఓ డీకే బాలాజీ ..



పాడేరు (జనహృదయం) : ప్లాస్టిక్ రహిత సమాజానికి  మన్యంలో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా  కృషిచేయాలని  పాడేరు  ఐ టి డి ప్రాజెక్ట్ అధికారి డి కె బాలాజీ ,ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మేజిస్ట్రేట్ మరియు మండల లీగల్ సెల్ సర్వీసెస్ చైర్ పర్సన్ శ్రీమతి డాక్టర్ కె శారద ,సబ్ కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సలిజాముల పిలుపునిచ్చారు. సమాజంలో ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు .ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి లో చేరి భూగర్భ జలాలు కాలుష్యం అవుతుందని అన్నారు .ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ కవర్లను, సంచులను వినియోగించకూడదని అన్నారు. వాటి వలన వ్యాధి వ్యాపిస్తుందని చెప్పారు .ప్లాస్టిక్ వినియోగం వలన పర్యావరణానికి హాని చేస్తుందన్నారు .పర్యావరణానకి ఏర్పాడే ముప్పు వలన సకల జీవరాశులకు తీవ్రమైన హాని జరుగుతుందన్నారు .ప్లాస్టిక్ వ్యర్ధాలను ఎక్కడబడితే అక్కడ వేయడం వలన పశువులు ,పక్షులు మృత్యువాత పడుతున్నారు. పట్టణంలో బహిరంగ ప్రదేశాల్లో రోడ్ల పక్కన వ్యర్థాలను వేయకూడదని అన్నారు. నిర్దేశించిన ప్రాంతంలోనూ చెత్త కుండీలలో మాత్రమే వేయాలని సూచించారు .పట్టణంలో విచ్చల విడిగా చెత్త వేయడం వలన అంటువ్యాధులు, మలేరియా ,డయేరియా వంటి వ్యాధులు సంక్రమిస్తాయని అన్నారు .పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణంలో వ్యాపారస్తులు దుకాణాల ముందు ఏర్పాటు చేయాలని సూచించారు .రోడ్లుమీద వేసే పరిస్థితులు పైన సీసీ కెమెరాల్లో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .వినియోగించిన మద్యం సీసాలు బహిరంగ ప్రాంతాలలో వేసే వారిపై నిఘా ఏర్పాటు చేసి వారి కఠిన చర్యలు తీసుకుంటామని ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ మరియు మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్పర్సన్ శ్రీమతి శారద హెచ్చరించారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా