జాతీయ పోటీలకు ఎంపికైన వైద్యుడు
గాజువాక (జనహృదయం): జిల్లాస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ పోటీల్లో గాజువాక కు చెందిన సీనియర్ ఫిజియోథెరపిస్ట్ ఆర్ బి కె చక్రవర్తి వెండి పతకం సాధించారు. ఈనెల 23 24 తేదీల్లో విజయనగరంలో జరిగిన జిల్లాస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2019 పోటీల్లో 800 మీటర్లు పరుగు 5 కిలోమీటర్లు బ్రిస్మ్ వాక్ కేటగిరీల్లో చక్రవర్తి వెండి పతకాలు సాధించారు. అంతేకాకుండా ఆయన జాతీయ పోటీకి ఎంపికయ్యారు. వైద్య సేవలు చేయడమే కాకుండా ఫిట్నెస్ గురించి అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచిన చక్రవర్తిని ఈ సందర్భంగా పలువురు వైద్యులు శ్రేయోభిలాషులు సన్మానించారు.
Comments
Post a Comment