దారుణం..డాక్టరు ప్రియాంక రెడ్డి హత్య..


హైదరాబాద్ :   షాద్‌ నగర్‌ టోల్‌ ప్లాజా సమీపంలో గురువారం రాత్రి వెటర్నరీ డాక్టరు ప్రియాంకరెడ్డి హత్యకు గురయ్యారు. ఈసంఘటనపై లోతుగా పరిశీలిస్తే పథకం ప్రకారమే వెటర్నరీ డాక్టరు ప్రియాంకరెడ్డి హత్య జరిగినట్లు తెలుస్తోంది. టోల్‌ ప్లాజాకు దూరంగా స్కూటర్‌ పార్కు చేయడం చూసిన దుండగులు ఉద్దేశపూర్వకంగా గాలి తీసి పక్షర్‌ ప్లాన్‌ వేశారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రియాంకరెడ్డి తిరిగిరావడం స్కూటర్‌ పై వెళ్లేందుకు ప్రయత్నించగానే పంక్చర్‌ అయిందంటూ కాస్త బలవంతంగా స్కూటర్‌ పంక్చర్‌ వేయిస్తామంటూ తమతో స్కూటర్‌ తీసుకువెళ్లడం, ఈపరిణామాలపై ప్రియాంక చాలాసేపటివరకు తన కుటుంబ సభ్యులతో ఫన్‌ మాట్లాడుతూ తీవ్రంగా భయాంధోళన చెందడం ఈవిషయాలన్నీ గమనిస్తే పథకం ప్రయారమే ప్రియాంకరెడ్డిని అత్యాచారం చేసి హత్యచేశారనే పలువురు భావిస్తున్నారు. అయితే భయపడుతూ ప్రియాంక తన సోదరికి బదులుగా పోలీసులకు ఫోన్ చేసినా, ప్రియాంక సోదరి అయినా పోలీసులకు ఫోన్ చేయాలనీ సలహా ఇచ్చినా ఈదారుణం నుండి ప్రియాంక బయటపడే అవకాసం ఉండేది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది .


ఈ సంఘటన  పై శంశబాద్‌ డిసిపి ప్రకాష్‌ రెడ్డి అందించిన వివరాలిలా ఉన్నాయి. హత్యకు గురైంది డాక్టర్‌ ప్రియాంక రెడ్డి. చటాన్‌ పల్లి ఘటన స్థలాన్నీ పరిశీలించినా నవాబ్‌ పేట మండలంలోని కొల్లురులో వెటర్నరీ డాక్టర్‌ గా పని చేస్తున్నారు. నిందుతులకోసం 15 బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. షాద్‌ నగర్‌ పట్టణంలోని చటాన్‌ పల్లి శివారులో జరిగిన గుర్తు తెలియని యువతి హత్య కేసులో షాద్‌ నగర్‌ పోలీసులు అన్ని కోణాల్లో ప్రారంబించారు.


చటాన్‌ పల్లి వద్ద ఓ వంతెన పక్కన దారుణంగా హత్య చేసి చంప బడ్డది డాక్టర్‌ ప్రియాంక రెడ్డిగా పోలీసులు నిర్ధారించారు. ఘటనాస్థలానికి శంషాబాద్‌ డిసిపి ప్రకాష్‌ రెడ్డి, షాద్‌ నగర్‌ ఏసీపీ సురేందర్‌, ఇన్స్పెక్టర్‌ శ్రీధర్‌ కుమార్‌ చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రత్యేక టీమ్‌ లను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. యువతి పై పెట్రోల్‌ పోసి తగలబెట్టిన ఘటనలో శంషాబాద్‌ కు చెందిన యువతిగా గుర్తించారు. అయితే వీరిది సొంత గ్రామం కొల్లాపూర్‌ నర్సాయపల్లి గ్రామానికి చెందిన వారు అయితే స్థిరపడింది మాత్రం శంశబాద్‌ లో నివాసం ఉంటున్నారు. మ తి చెందిన యువతి తండ్రితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎందుకు ఆ యువతిని పెట్రోలు పోసి తగలబెట్టారు అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 15 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే ఘాతుకానికి పాల్పడినా దుండగులను పట్టుకుంటామని తెలిపారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా