కుటమికే పీఠం.... సిఎంగా ఉద్దవ్ ఠాక్రే
ముంబాయి : శివసేనకే నింహాసనం ఖరారయ్యింది. అనూహ్య రాజకీయపరిణామాలు నేపథ్యంలో రోజుకోమలుపుతిరుగుతూ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, రాజీనామా వ్యవహారాలు చకచకా జరిగిపోయి, వ్యూహానికి ప్రతివ్యూహంతో బిజేపి, శివసేన సంకీర్ణ కూటమి అలుపెరగని పోరుసాగించాయి. వీటిలో బిజేపి ఓమెట్టు ఎక్కి ముందువరసలో నిలువగా అంతే స్పీడులో వెనక్కిరావాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. చివరి వరకు కలిసికట్టుగా ముందుకు సాగిన సంకీర్ణ పార్టీలకు ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. ఈమేరకు శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతన్నాయి. గురువారం సాయింత్రం మహారాష్ట్ర ముంఖ్యమంత్రిగా దాదర్‌లో గల శివాజీపార్కులో ప్రమాణసీకారోత్సవానికి ఏర్పాటు జరుగుతున్నాయి. మహా కూటమిలో మంత్రి పదవుల పంపకంపై నిర్ణయం ఓకొలిక్కిచేరి శివసేన పార్టీ నుంచి సిఎంతో సహా 16మంది, ఎన్సీపీకి డిప్యూటీ సిఎంతో పాటు 14మందికి, కాంగ్రెస్ నుంచి స్పీకర్‌తో సహా 13మందికి మంత్రి పదవులు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు.
మహా సిఎం ఉద్దవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, బెంగళ్ సిఎం మమతా బెనర్జీ, డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, డిఎంకె అధినేత స్టాలిన్‌తోపాటు పలువురు నాయకులకు ఆహ్వానం పంపారు.
Comments
Post a Comment